‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) సారస్వత ధురీణ, రాజనీతి విద్యా విశారద, మన్నారు దాసవిలాసము కృతికర్త (9) |
8) వెయ్యి స్తంభాలగుడి (5) |
9) దయ, జాలి, కనికరం (3) |
11) స్త్రీ తిరగబడింది (2) |
12) తెల్లనిది, స్పష్టంగా, వివరంగా (4) |
14) ధనలక్ష్మీ- ధనలక్ష్మిని గట్టిగా పిలవండి (4) |
16) మహా సంతోషము (5) |
17) చివరలేని సూక్ష్మ ఖండము, ధూళి (2) |
18) కుడ్యము, గుఱ్ఱము (2) |
19) గృహములు, స్థానములు, కాగితముల టావులు (3) |
21) నుయ్యి, చెలమ, ఓడకంబము – వెనునుంచి ముందుకి (3) |
22) మా భర్త గారు (3) |
24) గొప్పవారు ఏ కారణము లేకుండా వూరకనే రారని – కుడి నించి ఎడమకి – చెప్పండి, చివర మూడక్షరాలు కొంచెం తడబడ్డాయి. (9) |
నిలువు:
1) అన్నమయ్య బిరుదు. ఆ బిరుదుతో ఆయనని గట్టిగా పిలవండి (9) |
2) పార్వతీ పరమేశ్వరులు (7) |
3) స్త్రీ, లేత (2) |
4) సంగ్రహ వ్యాఖ్య, టీక (3) |
5) వర్ణము, కాంతి, శోభ, పొవు, విధము (2) |
6) పొడుగాటి పొయ్యి, చీలిక, పగులు, పశువుల నీళ్లు తాగడానికి ఏర్పరచిన రాతి తొట్టి (2) |
7) ఈమెగారు కళా ప్రపూర్ణ, కవయిత్రీ తిలక, సాహితీ రుద్రమ వంటి చిరుదులు పొందారు, అటు నుంచి వ్రాయాలి (9) |
10) చివరలేని వాక్కు, అశుభమైనది (2) |
11) నెత్తి, శిరస్సు, జుట్టు, చోటు, రంగము, పక్షము (2) |
13) గారాబము, గొప్పతనము, ప్రేమము, స్నేహము, మమకారము (3) |
14) క్రింద నుంచి పైకి – గోకులము, గో సంపద; చివరి అక్షరాలు తారుమారయ్యాయి (3) |
15) శిక్షించుట, చెల్లా చెదరయింది (4) |
20) మంచానికి అల్లుకుని నేసుకునేది (3) |
22) తల్లి యొక్క సోదరుడు, తండ్రి యొక్క సోదరి భర్త, పిల్ల నిచ్చిన తండ్రి, భర్త యొక్క తండ్రి (2) |
(23) వారు రాలేరుట, క్రింద నించి పైకి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 సెప్టెంబర్ 03వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 130 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 సెప్టెంబర్ 08 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 128 జవాబులు:
అడ్డం:
1.తాపేశ్వరం కాజాలు 6. పోళీలు 7. మలముకో 9. ఆపద 11. పూజ కుండలు 13. కనుక 14. బూమిసుత 15. యకా 16. డుచుక 17A. లుకలకలాడు 19. పాలు 20. పరమాన్నము
నిలువు:
1.తాళీ 2. పేలు 3. కామద 4. జాల 5. లుము 6. పోలి పూర్ణం బూరెలు 8. కోవా కజ్జికాయలు 9. ఆడ 10. పలుకు 12. కుంతీసుతులు 13. కరం 16. డు లా ర 17. చుడుమా 18. కథ 18A. కప 19. పాము
సంచిక – పద ప్రతిభ 128 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కరణం రామకుమార్
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పద్మావతి కస్తల
- పి.వి. రాజు
- ప్రవీణ డా.
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి
- శంబర వెంకట జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]