[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘అందులో నేనెక్కడో?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఎ[/dropcap]వరో
నీవెవరో
నా మనసు గది లోకి
చొరబడ్డావు
ఎవరూ రాని చోటుకే
వచ్చావు
దుర్భేద్యమైన
ఎద తలుపులు ఎంచక్కా
తెరచుకున్నావ్
నన్ను ఆసాంతం పరచుకున్నావ్
నాదనుకున్న మనసు
నీదైపోగా
అందులో నేనెక్కడో
వెతుక్కునే పనిలో ఉన్నా
నీవైనా నేనైనా
ఒకటే కదా అని
చివరిలా సర్దుకుంటున్నా