[2024 సెప్టెంబర్ 07 వినాయక చవితి పర్వదినం సందర్భంగా – ‘వినాయక చవితి (పంచపదులు)’ అనే కవితని అందిస్తున్నారు డా. షహనాజ్ బతుల్.]
1.
అందరూ వినాయకునికి తొలి పూజలు చేస్తారు.
పుట్టినరోజున వినాయక చవితి చేస్తారు.
వినాయకుని మూర్తికి పూజ చేస్తారు.
విగ్రహము పైన పాలవెల్లి కడతారు.
మారేడు సీతాఫలం కొన్ని వ్రేలాడదేస్తారు బత్తులా
2.
పొంగలి, ఉండ్రాళ్ళు నైవేద్యం చాలామంది పెడతారు.
అందరూ వినాయకునికి పూజ చేస్తారు.
విఘ్నాలు కలగకూడదని కోరుకుంటారు.
మండపాలు కట్టి, తొమ్మిది రోజులు పూజలు చేస్తారు.
తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు బత్తులా.