[dropcap]‘సం[/dropcap]చిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) పొమ్మనలేక —- నట్లు. ఎవరైనా తమ యింటికి వచ్చినవారు ఎంతకీ వెళ్ళకుండా తమని విసిగిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే, వాళ్లని వెళ్లిపొమ్మన లేక ఇంటివాళ్లు ఇలా చేస్తూవుంటారని ఈ సామెతని వాడుతూంటారు (4) |
3) ఇఱ్ఱి, ఏనుగు, తుమ్మెద, వానకోయిల, చిత్రవర్ణము కలది (4) |
7) సన్నపు మెడ గల చెంబు, కమండలపు (2) |
8) శివుని సతి, మేనకా హిమవంతుల పుత్రిక (3) |
9) అధిపుడు, గొప్పవాడు, శ్రేష్ఠము, గొప్ప, బంట్రోతు (2) |
12) యుద్ధము; పోరు (3) |
13) విల్లు, ఎఱ్ఱగన్నేరు, వెదురు, ధనూరాశి, పనియందు నేర్పరి (3) |
17) తిరగబడిన నేర్పరి, సమర్థురాలు (3) |
18) వృషపర్వుడనే రాక్షసుడి కూతురు, యయాతి మహారాజు భార్య (3) |
19) ఋక్కు, ఆదిశ్రుతులు, జ్ఞానము, తొలిచదువులు (3) |
22) అర్జునుడి భార్య, బభ్రువాహనుడి తల్లి (4) |
23) ఒక రాగం, (కర్నాటక) సంగీతం యొక్క రాగాలలో 66వ రాగం, చాలా చిత్రంగా వుంటుంది |
నిలువు:
1) —- పుల్లకూర రుచి (4) |
2) కల్యాణము, వివాహము, ఉద్వాహము (2) |
4) ఇంద్రుని సభలో ఒక నర్తకి, అప్సరస, దేవలోకంలో వున్న అప్సరస, అరటి (2) |
5) త్రిపురములు, పురత్రయం (4) |
6) మలయాళ, తమిళ, తెలుగు నటి; మరో ప్రసిద్ధ తెలుగు నటి బిరుదు (3) |
10) తుమ్మెద; ముంగురులు, కుమ్మరి సారె (3) |
11) కుమ్ము, సూర్యుని గుఱ్ఱము, తుషాగ్ని (2) |
14) కాణాచి, ఆటపట్టు, చిరకాలవాసస్థానము (4) |
15) లక్ష్మణుని భార్య (3) |
16) సరస్వతి, మద్యం, ఆడకోయిల, బాణకవి కావ్యాల్లో ఒక సుప్రసిద్ధ పద్యకావ్యం (4) |
20) హస్తాదుల సంజ్ఞ, సన్న (2) |
21) రాజమహేంద్రవరాన్ని ఏలిన రాజరాజ నరేంద్రుని రెండవ భార్య పేరు, చివర పోయింది (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 సెప్టెంబర్ 24వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 133 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 సెప్టెంబర్ 29 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 131 జవాబులు:
అడ్డం:
1) జగన్మోహినీ అవతారం 7) లయ 8) ళంగ 9) కల 10) త్రప 12) ముక్కోణము 13) యంజనంధ 14) మా 15) మందాకిని 19) వీలునామా 22) త్రావాతిన్నా 23) రసానంయ 24) లన 25) కులం కన్నా గుణం ముఖ్యము
నిలువు:
1) జలజము 2) గయ 3) హిజ్జలము 4) అక్షిత్రయం 5) తాళం 6) రంగనాధ రామాయణము 9) కణ 11) పజ 15) మంత్రాలకు 16) దావానలం 17) కితి 18) నిన్నా నన్నా 19) వీరపాణం 20) లుసా 21) నానం
సంచిక – పద ప్రతిభ 130 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధా సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భద్రిరాజు ఇందుశేఖర్
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి. బృందావన రావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- మధుసూదన్ తల్లాప్రగడ
- మంజులదత్త కె
- పద్మావతి కస్తల
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
- విన్నకోట ఫణీంద్ర
వీరికి అభినందనలు.
[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]