[dropcap]గో[/dropcap]వాడ క్రియేషన్స్ అసోసియేషన్స్ నిర్వహించిన ‘కీ. శే. గోవాడ మల్లీశ్వరి స్మారక నాటిక రచన పోటీ 2024’లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన సభ 13 సెప్టెంబర్ 2024 న, హైదరాబాదులోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగింది.
రచయితలను సన్మానించి జ్ఞాపిక, నగదు బహుమతులు అందజేశారు. మొత్తం 8 మంది విజేతలు. వీరిలో పాణ్యం దత్తశర్మ గారు ఒకరు. ఆయన రచించిన నాటిక ‘కుమాతా న భవతి’ కి విశేష బహుమతి లభించింది. ప్రముఖ సినీ, నాటక రచయిత శ్రీ మాడభూషి దివాకర్ బాబు రచయితలను సత్కరించి, బహుమతులను అందించారు.
డా. వెంకట్ గోవాడ, సభకు ప్రయోక్తగా వ్యవహరించారు. సభాధ్యక్షులు శ్రీ స్వరాజ్ కుమార్ భట్టుగారు. డా. కోట్ల హనుమంత రావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళాపీఠాధిపతి, ‘సహరి’ పత్రిక సంపాదకులు శ్రీ గొర్లి శ్రీనివాసరావు, ప్రముఖ నృత్య బోధకురాలు డా. కోట్ల అనితారావు, అతిథులుగా హాజరైనారు.
నాటికల పోటీకి న్యాయనిర్ణేతలు – PSTU ఆచార్యులు (ధియేటర్ ఆర్ట్స్) డా. పద్మప్రియ, డా. కల్యాణి, డా. సమ్మెట విజయ గారలు హాజరై, బహుమతి పొందిన నాటికలను సమీక్షించారు.
పాణ్యం ప్రత్యూష