సంతకం ముద్ర

0
3

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘సంతకం ముద్ర’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సం[/dropcap]తకంలో
ఎంత పెద్ద పేరైన
చిరు అక్షరాలుగా
ఇమిడి పోవలసిందే

ముద్రలో
ఎంత గొప్ప హోదా ఉన్న
సూక్ష్మ అక్షరాలుగా
ఒదిగి పోవలసిందే

సంతకానిది ముద్రది
జగమెరిగిన బంధం
ఏ శక్తి కూడా
వాటిని విడదీయలేదు

ఆ జంటది
అవినాభావ సంబంధం
ఆ రెంటిది
అద్వితీయ అనుబంధం

అన్యోన్యంగా
రెండూ ఒకటిగా
పరస్పరం జీవిస్తున్న
సంతకం ముద్ర ద్వయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here