[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘నవ్వూ పువ్వూ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]పొ[/dropcap]ద్దున్నే
చేతిలో వాలిపోయే దినపత్రిక
చాయనో కాఫీనో చప్పరించే జిహ్వ
హగ్ చేసుకోలేని సూర్యుడు మనిషితో ఉదయపు నడక
ఓహ్! సూపర్ బిగినింగ్ కిక్
అంతా యాంత్రిక కుస్తీ
ఆయన అక్కడ
యథాలాపంగా వీచే పూవు పరిమళం
నడక ఎదురెదురు బస్సుల మౌనం నడుమ చెలగే మాటలు
ఇక్కడ కొనడమే వన్ వే లవ్ మార్కెట్ కాదు
ఇచ్చిపుచ్చుకునే రాకపోకల నడక
దారికి గమ్యం ఉందో లేదో
తెలియని ఆశ్చర్య అయోమయం
పిల్లాడి ఏడ్పుకు దొరకని చిట్కాలా
అయితే ఇద్దరు కలిసినప్పుడు
పలకరించేది కవిత్వం
మాట్లాడేది తొణికే మానవత్వం
ఇద్దరూ కలువని రైలు పట్టాలు కాదు
యాత్రలో సమకాలీన గత భూత కాలాల నడుమ
జీవం పోసుకున్న ప్రేమ పక్షులు
కలిసి కళగా
తెరుచుకున్న అక్షర కిటికీలు
ప్రపంచానికి అర్థంగానిది గాలి మాత్రమే
నవ్వే పువ్వు ఓ అద్భుతమైన కాటలిస్టు