[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘చక్రభ్రమణం’ అనే కవితని అందిస్తున్నాము.]
[dropcap]బా[/dropcap]ల్యం దాటి పోయింది
యవ్వనం ఆక్రమించింది
పెళ్ళి తంతు ముగిసింది
డబుల్ కాట్ లో
కాలక్షేపం మొదలైంది
రెండు మూడేండ్ల తర్వాత
మంచాలు వేరయ్యాయి
పిల్లల పెంపకం ముఖ్యమైంది
పెనిమిటి మీద ధ్యాస తగ్గింది
పరిచయస్థులు
అపరిచయస్థులుగా
మారారు
ఎడం పెరిగింది
రెక్కలొచ్చి పిల్లలు
ఎగిరి పోయారు
లింగి లింగడు
మిగిలారు
సింగల్ కాట్
డబల్ కాట్ అయ్యింది
తలుచుకొని మురవడానికి
చేదు తీపి జ్ఞాపకాలు మిగిలాయి
ఇదేరా జీవితం
జీవితమొక
చక్రభ్రమణం