[డా. గండ్ర లక్ష్మణ రావు రచించిన ‘తంగేడు మనసు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap] రెక్కలు విరిచి
నా అందాన్ని కొల్లగొట్టారని కుమిలిపోనా
నా రెక్కలు మడిచి అందంగా పేర్చి
నా చుట్టూ ఆడిపాడి
నన్ను అమ్మగా కొలిచినందుకు మురిసిపోనా
పుట్టమీదనో బాయిగట్టు మీదనో గుట్ట రాళ్ళనడమనో
పుట్టి వాడిపోయేదాన్ని
పట్టించుకోకుండా వ్యర్థమయే బ్రతుకు
పండుగలా దేవతలా
బ్రతికిన ఒక్కరోజైనా చాలుగదా
వనంలో పుట్టిన మా జీవనం
మానవులకేకదా అంకితం
దేవతగా బతుకమ్మగా
సంబరం సార్థకం
ఆదరింపబడితే
రత్నమూ1 నేనూ ఒక్కటే.
(1. రతన్ టాటా)