[dropcap]ప్ర[/dropcap]పంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రత్యేక ఆకర్షణ
6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో
‘ఆలపిస్తాం తీయగా’ ప్రత్యేక యువగళ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం.
డిసెంబరు 28, 29 తేదీలలో విజయవాడ కె. బి. యన్. కళాశాల ఆవరణలో జరిగే ఈ మహాసభలలో ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే అంశం మీద ప్రత్యేక యువ గళ సమ్మేళనం జరుగుతుంది. ప్రముఖ రచయితలు వేదికపైన ఆశీనులై ఈ యువగళ సమ్మేళనాన్ని నడిపిస్తారు. రోజుకు 50 మంది చొప్పున రెండు రోజుల్లో 100 మంది కవులకు మాత్రమే ఈ యువగళసమ్మేళనంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ప్రతిభావంతమైన ప్రదర్శనకు ఈ మహాసభలలో ప్రత్యేక సత్కారం, ‘పర్యావరణకవి’ పురస్కారం అందించి గౌరవిస్తాము.
- ప్రతినిధులుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ యువగళ సమ్మేళనంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
- 40 యేళ్ల లోపు వారంతా ఈ యువగళ సమ్మేళనంలో పాల్గొనవచ్చు.
- కవిత, గేయం, లలిత గీతం, గజల్, పద్యం ఏ ప్రక్రియలో నైనా తెలుగు భాషలో కవులు తమ గళాన్ని వినిపించవచ్చు.
- 2 నిమిషాల కాలవ్యవధి మించకుండా రచన ఉండాలి.
- స్వీయ రచనలే అయి ఉండాలి. వ్రాతప్రతిని ముందుగా 9440167697 నెంబరుకు వాట్సాప్ ద్వారా గాని క్రింద ఇచ్చిన కార్యాలయం చిరునామాకు గాని పంపవలసి ఉంటుంది.
- ఎంపికైన రచనలకు మాత్రమే యువగళంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
- మహాసభల ఆహ్వానపత్రంలో యువగళ కవుల పేర్లు ప్రకటిస్తాము
పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో నేటి తరం యువతీ యువకుల మనో భావాలను ఈ యువగళ సమ్మేళనం ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాం.
పర్యావరణ కవుల ఈ గళాలను పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం.
ఈ యువగళ సమ్మేళనం తో పాటుగా విడిగా విద్యార్థులే కాకుండా ప్రతినిధులుగా నమోదైన ఇతరులు కూడా కథ, కవిత పద్యం వగైరా 10 అంశాలపై జరిగే శిక్షణా తరగతులలో కూడా పాల్గొన వచ్చు.
కవిసమ్మేళనాలు, ప్రసంగ సదస్సులు యథావిధిగా జరుగుతాయి.
మహాసభలలో తాము పాల్గొన దలచిన అంశం ముందుగా మాకు తెలియ జేస్తే సాధ్యమైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తాము.
ప్రతినిధుల నమోదు చివరి దశకు చేరుకుంది. సభా ప్రాంగణం పరిమితుల రీత్యా అనుకున్న సంఖ్యను చేరగానే నమోదు ప్రక్రియ ముగుస్తుంది.
మరిన్ని వివరాలకు: గుత్తికొండ సుబ్బారావు- 9440167697, జి వి పూర్ణచందు- 9440172642లను సంప్రదించవచ్చు.
కార్యాలయం చిరునామా: ప్రపంచ తెలుగు రచయితల సంఘం, సత్నాం టవర్స్, బకింగ్ హాం పేట పోస్టాఫీస్ ఎదురు, గవర్నర్ పేట విజయవాడ-520002.
గుత్తికొండ సుబ్బారావు,
జి వి పూర్ణచందు