[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘మట్టే మనిషోయ్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]తె[/dropcap]లుసుకోవోయ్ మనిషి
హృదయ గీతాలను తెలుసుకోవోయ్
హతమార్చిన దుండగుడు ఎవడోయ్
కాలినడకతో బయలుదేరిన
మనిషి ఆత్మననోయ్
కడలిలో కూరుకు
పోయిన మట్టే మనిషోయ్
తెలుసుకో భారతీయుడా
నువ్వు ఎవరివోయ్
కాదన్న మాటకు విలువెక్కువోయ్
నిజాయితీగా బ్రతుకుతున్న
ఓర్వలేక నిందలు మోపడమెక్కువోయ్
చెయ్యి చెయ్యి కలిపితే యుద్ధాన్ని సృష్టించచ్చోయ్
యుద్ధంలో అమరుడైతే
జోహార్ అనే సంకేతము తక్కువోయ్
సాహిత్యమే సెలయేరు వలె పొంగిపొర్లుతు,
కడలిలో అలలు ఎగసి ఎగసి
తన గమ్యాన్ని చేరుకుంటుందోయ్
కలం సేద్యాము వలె విరజిమ్ముతూ
నవ యువ తరానికి
కాలానికి గగనానికి
తన అక్షరం చేరువైతే
ఆలోచన దృక్పథం మారుతుందోయ్..
లోలోనే కృంగిపోకోయ్
దేవదాసుగా మారకోయ్
కాలంతో పాటు కలాన్ని
కదిలించోయ్
కడలిలా ముందుకు సాగిపోవోయ్.