విశ్వర్షి వాసిలి వాఙ్మయ వరివస్య – అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం

0
4

[dropcap]ఆ[/dropcap]దికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం, మద్రాసు విశ్వవిద్యాలయం, మద్రాసు – సౌజన్యంతో ఎస్.కె.వి.పి. & డా.కె.ఎస్.రాజు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, పెనుగొండ 2024 నవంబరు -27, 28 తేదీలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం.

పశ్చిమ గోదావరి జిల్లా  పెనుగొండలో ఉన్న మా కళాశాల ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహించిన విషయం తెలుగు ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు విదితమే. అదే ఒరవడిని కొనసాగిస్తూ  ప్రస్తుతం  మరో అంతర్జాతీయ సదస్సుకు రూపకల్పన చేశాం.

2024 నవంబరు -27, 28 తేదీలలో ‘విశ్వర్షి వాసిలి వాఙ్మయ వరివస్య’ అనే అంశంపై నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు మీ సహకారాన్ని అభ్యర్ధిస్తున్నాం. మీ నుంచి పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన పరిశోధన పత్రాలను యూజీసీ కేర్ లిస్టెడ్ జర్నల్‌లో ప్రత్యేక సంచికగా ప్రచురించి పుస్తకరూపంలో మీకు అందించగలం. దీనికి అయ్యే వ్యయాన్ని మీరు భరించాల్సి ఉంటుంది (వివరాలు కొద్దిరోజుల్లో తెలియజేస్తాం).

“విశ్వజనీనమైన సాహిత్య రచన కొద్దిమందికే సాధ్యం. అందునా విశ్వకవి కావడం చాల అరుదైన విషయం” అంటూ ఇదేరీతిలో పలువురు ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు పొందిన వాసిలి వసంతకుమార్ గారి కలం నుండి జాలువారిన భిన్నకోణాల వాఙ్మయంలోని లోతుపాతుల్ని అవలోకించే ఉద్దేశ్యంతో ‘విశ్వర్షి వాసిలి వాఙ్మయ వరివస్య’ అనే అంశంపై నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు మీ పత్రాలను సిద్ధం చేసుకోవడానికి ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం.

మరిన్ని వివరాలకు, ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లింకు ద్వారా WhatsApp గ్రూపులో చేరవచ్చు.

https://chat.whatsapp.com/KkVJ60ODI00BzCMqbBb7pJ

ఎస్.కె.వి.పి. & డా.కె.ఎస్.రాజు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, పెనుగొండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here