సినిమా క్విజ్-113

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె. బి. నాగభూషణం దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., దేవిక, కన్నాంబ, ఎస్.వి.రంగారావు నటించిన ‘దక్షయజ్ఞం’ (1962) చిత్రంలో ‘బ్రహ్మ’ పాత్ర పోషించిన నటుడెవరు?
  2. మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అంజలీదేవి, చలం నటించిన ‘పరువు ప్రతిష్ఠ’ (1963) చిత్రంలో ‘జడ్జి’ పాత్రలో నటించినదెవరు?
  3. బి.ఎస్. రంగా దర్శకత్వంలో ఒకేసారి కన్నడంలోను, తెలుగులోనూ ‘అమరశిల్పి జక్కన’ (1964) సినిమాని తీశారు. తెలుగులో అక్కినేని, బి. సరోజాదేవి ప్రధానపాత్రలు. కన్నడంలో ‘జక్కన’ పాత్ర పోషించిన నటుడెవరు?
  4. కె. కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, కాంతారావు, ఎస్.వి.రంగారావు నటించిన ‘పాండవ వనవాసం’ (1965) చిత్రంలో అజిత్‍సింగ్ ఆంజనేయుడిగా నటించారు. ‘సత్యభామ’ పాత్రలో నటించినదెవరు?
  5. బి. ఎస్. నారాయణ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, చంద్రకళ, నాగభూషణం నటించిన ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు ‘ప్రేమించి పెళ్ళి చేసుకో’ (1965). టివి రాజు సంగీతం అందించిన ఈ సినిమాకి సంభాషణలు బొల్లిముంత శివరామకృష్ణ వ్రాశారు. ఈ సినిమా ఏ పేరుతో విడుదలైంది? (క్లూ: నటిగా చంద్రకళ తొలి చిత్రం ఇది)
  6. కె. హేమాంబరధరరావు దర్శకత్వంలో పద్మనాభం, వాణిశ్రీ, శోభన్‍బాబు, గీతాంజలి నటించిన ‘పొట్టి ప్లీడరు’ (1966) చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ గారి ‘ఇదేమిటి’ నవల ఆధారం. ఈ సినిమాలో ‘హంతకుడి’ పాత్రలో నటించినదెవరు?
  7. సి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, వాణిశ్రీ నటించిన ‘భువనసుందరి కథ’ (1967) చిత్రానికి సంగీతం ఘంటసాల. ఈ చిత్రంలో ‘చాకలి తిప్పడు’ పాత్రలో నటించినదెవరు?
  8. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, జమున, శోభన్‍బాబు, విజయనిర్మల నటించిన ‘పూలరంగడు’ (1967) చిత్రానికి ఎ. జె. క్రోనిన్ రచించిన ఏ నవల ఆధారం?
  9. పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, జగ్గయ్య నటించిన ‘ప్రాణమిత్రులు’ (1967) చిత్రానికి ప్రేరణ ఏ ఆంగ్ల చిత్రం?
  10. బాపు దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల, విజయలలిత నటించిన ‘సాక్షి’ (1967) చిత్రానికి కథ ముళ్ళపూడి వెంకటరమణ. ఈ సినిమాకి ప్రేరణ ఏ అమెరికన్ చిత్రం?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 నవంబర్ 05వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 113 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 నవంబర్ 10 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 111 జవాబులు:

1.మిక్కిలినేని 2. రాజనాల 3. చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ 4. కె.వి.యస్.శర్మ 5. వంగర 6. ఎన్గల్ సెల్వి 7. చలం 8. ధూళిపాళ 9. శాండో కృష్ణ 10. ఎం. బాలయ్య

సినిమా క్విజ్ 111 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి. బృందావన రావు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • శంభర వెంకట రామ జోగారావు
  • సునీతా ప్రకాష్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here