‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) పరమహంస శిష్యుడు ఈ స్వామి (5) |
4) బలపాన్ని ఇలా కూడా అంటారు (5) |
8) సారధి, గుర్రపు రౌతు (2) |
9) విష్ణుమూర్తి (2) |
11) కొంతమంది – – – – కొండంతలు చేస్తారు (4) |
13) వడ్ల విత్తనం (4) |
15) జంజాటమును ఈ బందీ అనొచ్చు (3) |
17) ఒక వంట పాత్ర (3) |
19) మట్టసపు గుర్రము, టంగనా (3) |
21) వసించే చోటు – ఆఖరక్షరం లేదు (3) |
22) బావుల నీళ్ళు పారించి పండించే పొలము (3) |
23) యౌవనంలో ఉన్న స్త్రీ (3) |
24) వృద్ధురాలు (4) |
27) కాపాడుదామనే కోర్కె గలవాడు (4) |
30) ఇరవై మణుగులు – కురుచైనది (2) |
31) విచారిస్తున్నాను. వెరీ వెరీ – – తడవ (2) |
33) కత్తి వాదర (4) |
35) సూక్ష్మమైనది (4) |
38) పొలం గట్టు (3) |
40) చెట్టు, భూమి నుంచి పుట్టిందిగదా (3) |
42) వరస తప్పిన మేనా(3) |
44) అందము గల ఆడుది (3) |
45) కుతూహలంతో మొదలయ్యే పదం. ఆఖరి అక్షరం సరళమైతే రాగి పైరు (3) |
46) మాలిన్యము (3) |
47) సమరము (4) |
50) తలవాకిటి చావడి; మొగసాల (4) |
53) స గణం పక్కన లఘువు (2) |
54) నెమ్మదిగా క్రిందకు రాలి (2) |
55) యుద్ధ భూమి (5) |
56) శివుడు (5) |
నిలువు:
2) కొలను (3) |
3) ఆనందింపబడినది, ఓ తెలుగు హీరోయిన్ పేరు (3) |
5) పెద్ద కెరటము (3) |
6) కరిగింది – చివర కరిగింది (3) |
7) కట్టిపడేసినట్లు చాకిరి చేసే దాసుడు (5) |
10) లక్ష్మణుడు ముక్కు కోసిన దెవరికి (5) |
11) పాలు, మజ్జిగ (4) |
12) చలించినది చలించినది (4) |
13) శంఖము (4) |
14) సంపాతి సోదరుడు (4) |
16) ఔషధం – అన్యదేశ్యం (2) |
18) దీనికి పెత్తనమిస్తే తలంతా గొరిగిందట – బహువచనం (2) |
20) జత (2) |
25) వికృతి చెందిన ద్విభాషి (3) |
26) అన్నిరకాలుగా (3) |
28) చూతఫల (3) |
29) మంగలి కత్తి (3) |
32) మగతనపు చేష్టలు (5) |
33) బహుళ పక్షంలో పదిహేనవ రోజు (4) |
34) రక్షింపబడినది. (4) |
35) అచ్చులతో అంతమగు పదములు కలిగినది (4) |
36) ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వ్యాపించిన దట్టమైన అడవులు (4) |
37) పొందబడినది (5) |
39) స్టాప్! (2) |
41) నూరు యోజనముల పొడవు గల చేప (2) |
43) పాలపిట్ట (2) |
48) మీ గొలుసు? శ్రేష్ఠమైనది (3) |
49) కలగని చివర జారిపోయింది (3) |
51) కోశాగారము (3) |
52) గోరింక (3) |
ఈ ప్రహేళికని పూరించి 2024 నవంబర్ 05వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-15 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 10 నవంబర్ 2024 తేదీన వెలువడతాయి.
పద శారద-14 జవాబులు
అడ్డం:
1) అభిసారిక 4) గతకాలము 8) మాపు 9) విక 11) తనువులు 13) పాదరసం 15) సదరు 17) గసాలు 19) గరిక 21) రక్షణ 22) సామీరి 23) దాగలి 24) మునుమును 27) కిసిమిసు 30) దుక్కి 31) పాహి 33) గారుడిక 35) ప్రాయికము 38) చక్కిలి 40) లకారం 42) కులట 44) లితువా 45) రసభ 46) టక్కరి 47) నవజీవం 50) మురిపము 53) జీవి 54) వాటి 55) కశేరుకము 56) రాజుమకుటం
నిలువు:
2) సామాను 3) రిపువు 5) తవిద 6) కాకర 7) అవసరము 10) దీపకలిక 11) తరుణము 12) లుగసాను 13) పాలురికి 14) సంగదాసు 16) దక్ష 18) సామీ 20) రిగ 25) నుదురు 26) ముక్కిడి 28) సిపాయి 29) మిహిక 32) విచలితము 33) గాలివాన 34) కలరవం 35) ప్రారంభము 36) ముకుటము 37) చుటరికము 39) క్కితు 41) కాస 43) లక్క 48) వజీరు 49) జీవిక 51) రివాజు 52) పటిమ
పద శారద-14 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ
- భద్రిరాజు ఇందుశేఖర్
- భాగవతుల కృష్ణారావు
- దేవగుప్తాపు ప్రసూన
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ
- కాళీపట్నపు శారద
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మంజులదత్త కె
- పి. వి. రాజు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామకూరు నాగేశ్వరరావు
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
వీరికి అభినందనలు.
ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.