[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. విరహం
నేల రాలని
చినుకు తాను
నిరీక్షించే పుడమి నేను
~
2. జీవం
బీడు భూమిలో
మోడువారిన చెట్టును
తడిపిన చినుకు
చిగురైంది!
~
3. అంతర్మథనం
మనోసరోవరంలో
మెరిసే జాబిల్లి
చిక్కదు దొరకదు
జాబిల్లి తాను
నింగి నేను!
~
4. గుట్టు
నమ్మిస్తూ
నీవు
నమ్ముతున్నట్లు
నేను!