[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘కృతజ్ఞతలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap] దగ్గర ఏమీ లేవు
శూన్య హస్తాలు తప్ప
మభ్యపెట్టే మాటలు రావు
నిష్కళంక మనస్సు తప్ప
మురిపించే సిరులు లేవు
పెనవేసుకున్న కష్టాలు తప్ప
ఈర్ష్యపడే తత్వం కాదు
అనుభవించిన వేదన తప్ప
నా గురించి అన్నీ తెలిసి కూడా
నీవు నాపై చూపే అభిమానానికి
నీకెలా.. ఎలా.. ఎలా..
కృతజ్ఞతలు చెప్పాలి నేస్తమా