[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘అభిమానం’ అనే కవిత అందిస్తున్నాము.]
[dropcap]హ[/dropcap]ద్దులు ఎల్లలు అవసరం లేనిది
ఎప్పటికీ ఎన్నటికే కొలవతరం కానిది
పొందిన కొద్దీ ఇంకా పొందాలనిపించేది
రక్త సంబంధానికి మించినదీ బంధం
దూరల తీరాలు కలపలేనిదైనా కలిసి మెలిసే
కన్నీళ్ళు కష్టాలు నిరంతరం కలబోసుకుంటూనే
అనురాగపు ఆలంబన అనుక్షణం తీగల్లే
ఆత్మీయత అనుబంధాలు కోకొల్లలుగా
కరుణాసముద్రం ఇరువురి మధ్య వంతెనలా
ఆప్యాయత వరదలై పొంగే చెలిమి
అవధులు లేని మాలిమి మనసుల మధ్య
మమతల వెల్లువ కనిపించని రీతిన
ప్రేమ పరవళ్ళు హృదయాంతరాలలో
నిత్యం.. అనునిత్యం.. కొన ఊపిరి దాకా
వీడని బంధంలా..!