[dropcap]జా[/dropcap]తీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కృషి సల్పుతున్న పరిశోధక రచయితకు ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2024కి గాను ప్రముఖ పరిశోధకులు, రచయిత ఆచార్య వెలమల సిమ్మన్నకు ప్రకటించింది.
పరిశోధనా రంగంతోపాటు అనేకమంది తెలుగు వైతాళికుల పరిచయ రచనలు, భాషా పరివ్యాప్తికి విశేష ప్రతిభ కనబరిచిన సిమ్మన్న కృషిని గుర్తించి రచయితల సంఘం ఈ పురస్కారానికి ఎన్నిక చేసింది. ఈ పురస్కారం కింద్ర ₹ 3,000/- నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం, శాలువాలతో నవంబర్ 17వ తేది సాయంత్రం విజయవాడలోని మహాత్మగాంధీ రోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రచయితని సత్కరించడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు డా. చిల్లర భవానీదేవి అధ్యక్షతన జరిగే ఈ సభలో రచయితల సంఘం గౌరవాధ్యకక్షులు డా. పాపినేని శివశంకర్, ఠాగూర్ గ్రంథాలయ అధికారి కె.రమాదేవి తదితరులు పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నెలకొల్పిన ఈ ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం గతంలో బహుగ్రంథకర్త, రచయిత, పరిశోధకుడు గబ్బిట దుర్గాప్రసాద్, చారిత్రక పరిశోధకుడు సయ్యద్ నశీర్ అహమ్మద్, డా. చిల్లర భవానీదేవిలకు అందజేయగా, ఇప్పుడు అందుకుంటున్న సిమ్మన్న నాలుగవ వారు.
– చలపాక ప్రకాష్
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం