[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ తపన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]వి[/dropcap]నీలాకాశంలో తారలా
నువ్వెప్పుడు మెరుస్తూనే ఉంటావ్
పున్నమి నాటి వెన్నెలలా
నువ్వెప్పుడు చల్లగా ఉంటావ్
వీచే పిల్ల తెమ్మెరలా
నువ్వెప్పుడు హాయిగా ఉంటావ్
గలగల పారే సెలయేరులా
నువ్వెప్పుడు స్వచ్ఛంగా ఉంటావ్
గాలిలో ఎగిరే విహంగంలా
నువ్వెప్పుడు స్వేచ్ఛగా ఉంటావ్
గంతులు వేసే లేడి పిల్లలా
నువ్వెప్పుడు హుషారుగా ఉంటావ్
నీకై తపిస్తున్న నాపట్ల
నువ్వెప్పుడు ప్రేమగా ఉంటావ్