సంచికలో 25 సప్తపదులు-24

0
3

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
వేదం
నాదం
చదివితే దేశానికి క్షేమం మేధకి మోదం

ఉపద్రష్ట సుబ్బలక్ష్మి
హైదరాబాద్

2
లభ్యం
అలభ్యం
మనిషికి అత్యాశ వీడిన సంతృప్తియే సౌలభ్యం

విజయకుమారి ముదిగొండ
విజయవాడ

3
వ్యవధానం
సమాధానం
అడిగేవారికి చెప్పేవారికి మధ్య ఉండాలి సావధానం

సూర్యదేవర రవికుమార్
గుంటూరు.

4
మహానసము
విహాయసము
ఆధునిక స్త్రీ ఎదుగుతున్న ప్రగతికి సౌస్రవసము

(సౌస్రవసము=కీర్తి)

టేకుమళ్ళ ఆనందరావు
సింగపూర్

5
నిష
విష
తప్పుదారి వారికి సమర్థనకు దొరుకుతుంది మిష

కానుకొలను లక్ష్మీ సీత
హైదరాబాద్

6
మలుపు
గెలుపు
అందరికీ సేవలు అందించిన వారికి ప్రజలు పిలుపు

బగ్గాం సోమేశ్వరరావు
విశాఖపట్నం

7
సదనము
వదనము
కళకళలాడే ప్రతి కుటుంబములో ఆనందము అదనము

కాళీపట్నపు శారద
హైదరాబాదు

8
తారణ!
ప్రేరణ!
సామంతో మారని ధూర్తులకు దండోపాయమే నివారణ!

సిహెచ్.వి. బృందావన రావు
నెల్లూరు

9
తత్త్వం
అయస్కాంతతత్వం
మనుషులు మీనుండి తీసుకుపోలేరు పారదర్శకమైన మనస్తత్వం.

కే. ఎం. కే. మూర్తి
సికింద్రాబాద్

10
యాగం
త్యాగం
నిరంతరం అనుసరిస్తే మారుస్తాయి మన యోగం

శాంతమూర్తి
హైదరాబాద్

11
కట్టుబాటు
దిద్దుబాటు
దాంపత్యాన భార్యాభర్తల మధ్య రాకూడదు ఎడబాటు.

ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు
సారవకోట

12
కలుస్తుంది
నిలుస్తుంది
ప్రేమలో మనసులు విప్పినప్పుడే గుండెచప్పుడు తెలుస్తుంది

ధరణికోట శివరామప్రసాద్,
హైదరాబాద్

12
పండుటాకు
ఎండుటాకు
పెద్దవారిని కించపరచకు, అనుభవసారం నూరేళ్ళ -గోరింటాకు

శ్రీమతి భారతీకృష్ణ
హైదరాబాద్

13
అకృతము
వికృతము
భోగములు, సంపాదనల కన్నా, వ్యక్తిత్వ వికాసము సుకృతము.

పుష్ప వేఙ్కట శర్మా.
భువనేశ్వరము, ఒడిశా.

14
అపకారం
ఉపకారం
మనసు తీసుకొనే నిర్ణయాలకు మెదడు సహకారం

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

15
అతుకు
వెతుకు
నమ్మకం లేకపోతే మనిషికి లేదు బతుకు!

డాక్టర్ శైలజ మామిడాల
హనుమకొండ

16
ఒప్పు
చెప్పు
అవసరమైన చోట మౌనంగా ఉండటం తప్పు.

మురళి ఎఱ్రాప్రగడ
పలివెల

17
తరగదు
విరగదు
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు

శ్రీవాణి
తెనాలి.

18
పణ్యము
పుణ్యము
శ్రద్ధ పెడితే ఖచ్చితంగా సమకూరుతుంది నైపుణ్యము!!!

ఎమ్మెస్సార్ భార్గవి ప్రియ
విజయవాడ

19
బద్ధుడు
బుద్ధుడు
కోరికలకు లోబడక-కావాలి అంతఃకరణ శుద్ధుడు.

టి.రామాంజనేయులు
ఆదోని, కర్నూలుజిల్లా

20
యోగము
భోగము
సమన్వయంతో జీవితం పలుకుతుంది సంతృప్తి సరాగము

బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి

21
ఉపవాసం
వనవాసం
ఏ విద్యలో అయినా రాణించాలంటే కావాలి అభ్యాసం

శైలజ సామినేని
విజయవాడ

22
దుమ్ము
ఇమ్ము
మొహం వదిలేసి అద్దం తుడవడం వమ్ము

(ఇమ్ము : స్థానము, వమ్ము: వ్యర్థము)

వి శ్రీనివాస మూర్తి
హైదరాబాదు

23
భావుకుడు
ప్రేమికుడు
కలల అలలపై విహరించే నావలేని నావికుడు.

ఆర్ ఎస్ రాజకుమార్
విశాఖపట్నం

24
విడువకు
జడువకు
పదిమందితో బ్రతుకు వరం కడవరకు మరువకు!

కె.కె.తాయారు
మదనపల్లి (చిత్తూరు జిల్లా).

25
ధారకుడు
కారకుడు
పిలిస్తే పలికే దైవం ఏడుకొండలవాడే జగదోద్ధారకుడు.

కె.చెంచలరావు,
ఒంగోలు

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here