విశ్వర్షి వాసిలి వాఙ్మయ వరివస్య – అంతర్జాతీయ సదస్సు పత్ర సమర్పణ గడువు తేదీ పొడిగింపు

0
4

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో తొలి యౌగిక కావ్యం ‘నేను’ కావ్యకర్తగా విశ్వర్షి వాసిలి ‘అక్షరయోగి’ గాను, ‘విశ్వకవి’ గాను ప్రఖ్యాతులు. వారి సిద్ధాంతాలు సుబోధకాలు.. వారి మార్గాలు ప్రత్యేకాలు.. వారి దృక్పథాలు ఆలోచనీయాలు.. వారి దృక్కోణాలు విభిన్నాలు.. వారి అడుగులు అనుసరణీయాలు.. వారి చూపులు అంతరంగాన్ని తడుముతాయి.. వారి మాటలు హృదయాన్ని తడుపుతాయి.. వారి చేతలు ఊరడిస్తాయి. ఇలా వారి వ్యక్తిత్వం వ్యక్తిమత్వంగా ప్రభావం చూపుతూ వారిని అనుసరించేలా చేస్తుంది. వారే మన విశ్వర్షి.

ఇంటి పేరు వాసిలి. ఇంట పెట్టిన పేరు వసంతకుమార్. సాహిత్య ప్రపంచానికి యాభై పైచిలుకు పుస్తకాలతో రచయిత డా. వాసిలి వసంతకుమార్ గా అయిదు దశాబ్దాలుగా చిరపరిచితులు. పాత్రికేయ రంగంలో కాలమిస్ట్ డా. వాసిలిగా, విశ్వర్షి వాసిలిగా గత ఇరవై ఏళ్లుగా పాఠకులకు పరిచితులు. పత్రికల సంపాదకునిగా అనుభవజ్ఞులు. యాభై ఏళ్లుగా యోగ సాధకులు. మాస్టర్ యోగమార్గంలో గురువులు.

***

తెలుగులో స్నాతకోత్తర పట్టాను అందుకున్న మద్రాసు విశ్వవిద్యాలయంనుండే ‘అక్షరయోగి’ బిరుదును, జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నవారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తమ తొలి స్నాతకోత్తర విద్యార్థి అయిన విశ్వర్షి వాసిలి వారి సమగ్ర సాహిత్యంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులను నిర్వహించి తమ విద్యార్థిని సన్మానించుకుంటూ తమను తాము సన్మానించుకుంది. ఇప్పుడు విశ్వర్షి వాసిలివారి వాఙ్మయ వరివస్యను రెండురోజుల అంతర్జాతీయ సదస్సులతో మీ  ముందుకు తెచ్చేందుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, ఎస్.కె.వి.పి.-డా.కె.ఎస్.రాజు కళాశాల పూనుకుని‌ నవంబర్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్న సదస్సులకు మిమ్మల్ని‌ సాదరంగా ఆహ్వానిస్తున్నవి.

***

విశ్వర్షి వాసిలివారికి విద్యార్థులు అన్నా, యువత అన్నా అత్యంత ఆసక్తి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని సదా కాంక్షిస్తుంటారు. అందుకే వారు కలం పట్టి విద్యార్థుల కోసం చేసిన తొలి రచన‌ ది విన్నర్. గెలవటం ఎంత ముఖ్యమో గెలిపించటమూ అంతే ముఖ్యం అన్నది వాసిలివారి లక్ష్యం.‌ గెలవాలి గెలిపించాలి, ఒత్తిడి ఇక లేనట్లే, సిగ్గుపడితే సక్సెస్ రాదు, టైమ్ ఫర్ సక్సెస్, లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే, పెళ్లి : ఒక బ్రతుకు పుస్తకం వంటి వ్యక్తిత్వవికాసంపై రాసిన వారి పది పుస్తకాల టైటిల్స్ చూస్తే చాలు వారు ఎంత ముక్కుసూటి వ్యక్తో అర్థం అవుతుంది. వారి ప్రతి వాక్యం నినాదంగా ప్రతిహృదయాన్ని తాకి, మేల్కొల్పుతుంది.  వాసిలివారి ప్రతి గ్రంథ శీర్షిక, అధ్యాయ శీర్షిక విద్యార్థులకు పిలుపు నిచ్చినట్లే ఉంటుంది.  వారి రచనలు యువతను తీర్చిదిద్దేందుకే అని ఇట్టే తెలిసిపోతుంది. వారి లక్ష్యం, వారి గమ్యం యువతను వారి వెంట నడిపిస్తుంది. అందుకే కొన్ని సమావేశాలను, కార్యశాలను, వాసిలివారితో ముఖాముఖిని ప్రత్యేకంగా యువత కోసం, విద్యార్థుల కోసం ఈ అంతర్జాతీయ సదస్సులలో కేటాయించటం జరిగింది

***

*పత్ర సమర్పకులకు గమనిక*

వినూత్న రీతిన జరగనున్న ఈ సదస్సుల్లో తలపండిన పండితులు, ఆచార్యులు, కవులు, రచయితలు, వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ ప్రముఖులు, పరిశోధకులు, విద్యార్థులు  పత్రసమర్పణ చేయనున్నారు. మరిన్ని పత్రాలతో ఈ సదస్సు దిగ్విజయంగా జరగాలని ఆశిస్తూ.. పత్ర సమర్పణకు గడువు తేదీని ఈ నెల 20 వరకు పొడిగించాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ పత్రాలు సమర్పించవలసిందిగా మనవి.


ఈనెల 27, 28 తేదీల్లో జరుగనున్న ‘విశ్వర్షి వాసిలి వాఙ్మయ వరివస్య’ అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య వై. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ ఆచార్య జి. సుధాకర్ గారు, SVKP & Dr. KS RAJU ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కలిదిండి రామచంద్ర రాజు గారు.. చిత్రంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ YV. అప్పారావు గారు, కళాశాల పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య రంకిరెడ్డి రామ్మోహన్ రావు గారు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులు & సదస్సు కన్వీనర్ డాక్టర్ కె.వి.ఎన్.డి. వరప్రసాద్.

మరిన్ని వివరాలకు, ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లింకు ద్వారా WhatsApp గ్రూపులో చేరవచ్చు.

https://chat.whatsapp.com/KkVJ60ODI00BzCMqbBb7pJ

ఎస్.కె.వి.పి. & డా.కె.ఎస్.రాజు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, పెనుగొండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here