బియ్యపు సంచుల బొమ్మలు

0
3

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘బియ్యపు సంచుల బొమ్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ప్ర[/dropcap]తి ఇంట్లో బియ్యం సంచులు ఖచ్చితంగా ఉంటాయి. పూర్వ కాలంలో బియ్యం గోనె సంచుల్లో వచ్చేవి. అవి నీళ్ళలో తడిస్తే చీకిపోయేవి. ఇప్పుడు బియ్యం ప్లాస్టిక్ సంచుల్లో ప్యాకింగ్ చేయబడుతున్నాయి. ఈ ప్లాస్టిక్ సంచులు దాచి ఉంచుకుంటే ఎన్నో పనికొచ్చే వస్తువులు చేసుకోవచ్చు. ఈ తరం పిల్లలకు బియ్యం ఎలా వస్తాయో తెలియచేయాలి. సూపర్ మార్కెట్ నుంచి బియ్యం వస్తాయని పిల్లలు అనుకుంటున్నారు. పొలంలో బియ్యం ఎలా పండుతాయో చూపిస్తే ఆహారాన్ని వృథా చేయరు. అంతేకాక పండటానికి ఎంత కష్టపడాలో కూడా తెలియచెప్పాలి. అప్పుడే ఆన్నం విలువ తెలుస్తుంది. వరి పంట పండినప్పుడు వడ్లు వస్తాయి. వడ్ల పైపొట్టు తీస్తేనే బియ్యం వస్తాయని తెలియాలి. అంటే రైసు మిల్లుల వాడకాన్ని అవి చేసే పనిని వివరించి చూపాలి. పొలం మట్టిలో నుంచే మనం తినే అండి వస్తుందని తెలుస్తుంది. మా నాన్నకు రైసు మిల్లులు ఉండటం వలన మేమెప్పుడూ బియ్యంతో, వరిపొట్టుతో తవుడుతో ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడేమో బియ్యం సంచులతో బొమ్మలు చేస్తున్నాను.

బియ్యం వాడుకున్న తర్వాత మిగిలిపోయే సంచులు ప్రతి మహిళ ఇంట్లో దాచి పెట్టుకుంటుంది. ఎండు మిరపకాయలు ఎండబెట్టుకోవటానికి, అప్పడాలు, వడియాలు పెట్టుకోవడానికి ఎంతో ఉపయోగం. నేనయితే పప్పులు, సరుకులు ఎండపెట్టటానికి ఈ బియ్యపు సంచుల్ని వాడతాను. అప్పుడప్పుడు మా పేషేంట్లు పడుకోవడానికి కూడా వాడుకుంటారు. వానలు కురిసే సమయంలో తల, వళ్ళు తడవకుండా బియ్యపు సంచుల్ని రెయిన్ కోట్ లాగా వాడుకుంటారు. ప్రతి వస్తువుకూ ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు నేను లాండ్రీ బిన్ లాగా చేసి చూపిస్తాను. దీని కోసం పెద్ద సంచిని తీసుకుంటే బాగుంటుంది. పది, పన్నెండు సంచులు వెడల్పు ఉండే సంచి లాగా చేసుకుంటే బాగుంటుంది. సంచి చివర్లు కత్తిరించేసి నలుచదరంగా చేసుకోవాలి. ఇంట్లో పాత బట్టలుంటాయి కదా! సంచికి సమానంగా వస్త్రాన్ని కత్తిరించుకోవాలి. ఇప్పుడు దీనిని గుండ్రంగా కుట్టేసుకోవాలి. అడుగున వెడల్సుగా రావటానికి వేరుగా సంచి మరియు వస్త్రంతో కలిపి కుట్టుకోవాలి. ఇలా ఉంటే సంచి నిలబడదు. కాబట్టి ఒక ఇనుప వైరును గుండ్రంగా మడవాలి. ఈ రింగును అడుగు భాగాన ఒకటి పై భాగాన ఒకటి పెట్టుకోవాలి లాండ్రీ బిన్ తయారయింది. విడిచిన బట్టలు వేసేయండి.

పది మంది వచ్చి పోతూంటారు కాబట్టి ఎప్పుడూ రిపేర్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సిమెంట్లు పడకుండా నేను ఈ బియ్యపు సంచుల్నే వాడమని చెపుతాను. బేల్దారు పని వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. గోడలకు సిమెంటు చేసేపప్పుడు బండల మీద సిమెంటు పడకుండా బియ్యపు సంచుల్ని గోడ పక్కగా వరసన పరుస్తారు. ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి. సరుకులు తెచ్చుకునే సంచి నొకదాన్ని తయారుచేద్దాం పది రకాల సరుకులు పెట్టుకున్నా చిరిగిపోకుండా బలంగా ఉండేలా సరుకుల సంచిని చేసుకుందాం! బియ్యపు సంచి అంచులు కత్తిరించి సమానంగా ఉండేలా చూసుకోవాలి. సుమారుగా పదిహేను ఇంచుల సంచి వచ్చేలా చూసుకోవాలి. రెండు మడతలు వేసి సమానంగా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘ చతురస్రాకారంగా ఉండాలి. ఇలా రెండు బియ్యం సంచులు కత్తిరించుకోవాలి. అంటే రెండు వరసలు వేసుకుంటే బలంగా ఉంటుంది. జాకెట్ కు లైనింగ్ వేసుకున్నట్లుగా వేసుకోవాలి. దీర్ఘ చతురస్రాకారపు సంచుల ముక్కలకు రెండువైపుల అతుక్కోవాలి. పై భాగాన అంచులు కుట్టాలి. కింది భాగాన రెండు మూలలా చిన్న ముక్కలు కత్తిరించాలి. కత్తిరించాక అడ్డంగా అతికి కుట్టుకోవాలి. అప్పుడు సంచిలా కనిపిస్తుంది. అడుగు వెడల్పు ఉండే సంచిలా తయారవుతుంది. రెండు తాళ్ళు తయారు చేసుకుని పట్టుకునేందుకు కుడితే సరుకుల సంచీ తయారవుతుంది.

ఈ మధ్య బజారులో చిన్చి చిన్న వస్తువులు పెట్టుకునేందుకు అర్గనైజర్లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా బట్టలు పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సులు తయారవుతున్నాయి. బనియన్లు, అండర్ వేర్లు పెట్టుకోవడానికి చిన్న ఆర్గనైజర్ తయారుచేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఆఫీసులకు వెళ్ళేటపుడు చేతి రుమూళ్ళ, అండర్ వేర్లు బనియన్లు కనిపించక వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి అవస్థ పడుకుండా అన్నీ ఒక సంచి లాంటి ఆర్గనైజర్ లో పెడితే బాగుంటుంది. దీనికి గాను బియ్యం సంచుల్ని తీసుకుని రెండు నిలువు ముక్కలు, రెండు అడ్డం ముక్కలు కత్తిరించుకోవాలి. అయితే వీటిని బియ్యం సంచి కనబడేలా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అందుకే ఇంట్లోని పాత నైటీలు తీసుకుని కత్తిరించి పెట్టాను. వస్త్రవు ముక్కలు బయటకు కనిపించేలా కుట్టుకోవాలి. ఆడుగు భాగం బాగా వెడల్పుగా ఉంటేలా చూసుకోవాలి. అప్పుడే మనం బట్టలు పెట్టడానికి వీలవుతుంది. దీనికి తాళ్ళ అవసరం లేదు. ఏదైనా బీరువాలో పెట్టుకుంటే బావుంటుంది.

ఇదే విధంగా హ్యాండ్ బ్యాగ్ సైతం చేసుకోవచ్చు. అంటే దాదాపు క్లాత్ బ్యాగ్ లాగా ఉంటుంది. కానీ దీనికి ప్లాస్టిక్ సంచి ముక్కల్ని వాడటం వలన చినిగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. టిఫిను బాక్సులు, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. బియ్యం సంచుల్ని క్రింద పరచుకుని అంచులు కత్తిరించి తీసేయాలి. సంచి నలిగి పోకుండా పెట్టుకుంటే బాగుటుంది. ఒక వేళ నలిగిపోతే కొలతలు సరిగా రావు కాయిట్టి ఐరన్ బాక్సులో కాద్ది వేడితో రుద్దుకోవాలి. దాంతో ముడతలు పోయి శుభ్రంగా ఉంటుంది దీనిని హాండ్ బ్యాగ్ మోడల్‌లో కుట్టాలి ఇందులో బియ్యం సంచి ముక్కను మధ్యలో పెట్టి ముందు, వెనకలు రెండు వైపులా వస్త్రపు ముక్కలు కుట్టాలి. అంటే బ్యాగును బయటి నుంది చూసివా, లోపలి నుంచి చూసినా బియ్యం సంచి కనిపించకూడదు. అప్పుడు హ్యాండ్ బ్యాగు బాగుంటుంది.

బియ్యం సంచులతో డోర్ మ్యాట్లు కూడా చేసుకోవచ్చు. అయితే బియ్యం సంచులు నాలుగైదు వరుసలు వేసుకుని కుట్టుకోవాలి. తరువాత దీనిపై వస్త్రపు ముక్కలు కూడా రెండు మూడు వరసలు వేసుకోవాలి. అప్పుడే గట్టిగా ఉంటుంది. ఫాంటు బట్టలు అయితే బాగుంటుంది. పాత జీన్సు పాంటు ముక్కలు తీసుకుని బియ్యం సంచికి రెండు వైపులా కుట్టుకోవాలి. చుట్టూ అంచులాగా కూడా కుట్టుకుంటే బాగుంటుంది. వీటిని డోర్ మ్యాట్లుగా వాడుకోవచ్చు. వీటిని చూశాక ఇంకా కొత్త ఐడియాలు రావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here