[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘అందుకో జయజయ ధ్వానాలను నీవు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]త[/dropcap]లచుకో తలచుకో
నీ లక్ష్యాన్ని నీవు
నమ్ముకో నమ్ముకో
నీ కృషినే నీవు
నిలుపుకో నిలుపుకో
నీలోని ఓర్పును నీవు
మరువకు మరువకు
నీ విలువలను ఎన్నటికీ నీవు
మెసులుకో మెసులుకో
జాగ్రత్తగా ఎల్లవేళలా నీవు
అందుకో అందుకో
జయజయ ధ్వానాలను నీవు