సినిమా క్విజ్-117

0
3

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. జి.వి.ఆర్. శేషగిరిరావు దర్శకత్వంలో రామానాయుడు తీసిన ‘పాప కోసం’ (1968) చిత్రంలో బేబి రాణి, దేవిక, త్యాగరాజు, రామదాసు, జగ్గయ్య నటించారు. ఈ సినిమాలో జోసెఫ్ పాత్ర పోషించిన నటుడెవరు?
  2. మానాపురం అప్పారావు దర్శకత్వంలో హరనాథ్, జమున (ద్విపాత్రాభినయం), రేలంగి, గీతాంజలి నటించిన 1968 నాటి ఈ చిత్రానికి ఎమ్.ఎస్. శ్రీరామ్ సంగీతం అందించగా, రాజశ్రీ పాటలు రాశారు. ఆ సినిమా ఏది? (క్లూ: ‘ఆనాటి చెలిమి ఒక కల’ అనే పి.బి.శ్రీనివాస్ పాడిన పాట ఇందులోనిదే)
  3. తాతినేని రామారవు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ, గుమ్మడి నటించిన 1969 నాటి ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం అందించగా, కథ ముళ్ళపూడి వెంకటరమణ అందించారు. ఆ సినిమా ఏది? (క్లూ: ‘నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా’ అనే ఘంటసాల పాడిన పాట ఇందులోనిదే)
  4. విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ఆధారంగా, సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కాంతారావు, కె.ఆర్. విజయ, జమునలతో తీసిన ‘ఏకవీర’ (1969) చిత్రానికి సంభాషణల రచయిత ఎవరు?
  5. తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’కు రీమేక్‍గా, పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని, జగ్గయ్య, కాంచన, రాజశ్రీ లతో తీసిన ‘ప్రేమించి చూడు’ (1965) చిత్రంలో బుచ్చబ్బాయి పాత్రలో నటించినదెవరు?
  6. అక్కినేని, కృష్ణకుమారి, నాగభూషణం నటించిన ‘జమీందార్’ (1966) అనే సినిమాకి ఆంగ్ల నటులు కేరీ గ్రాంట్, ఆడ్రే హెప్‍బర్న్‌ నటించిన ఏ చిత్రం ఆధారం?
  7. 1942లో కె. వి. రెడ్డి దర్శకత్వంలో వి. నాగయ్య నటించిన ‘భక్త పోతన’ సినిమా వచ్చింది. ఇదే సినిమాని 1966లో జి. రామినీడు దర్శకత్వంలో గుమ్ముడి ప్రధానపాత్రగా, శారద, రావుగోపాల రావు ఇతర పాత్రలలో నటించగా మళ్ళీ తీశారు. 1966లో వచ్చిన ‘భక్త పోతన’లో వి. నాగయ్య ఏ పాత్ర పోషించారు?
  8. కె. సుబ్బరామదాసు తొలిసారి దర్శకత్వం వహించగా, శోభన్ బాబు, గీతాంజలి, గుమ్మడి, వాణిశ్రీ నటించిన సినిమా ఏది? (క్లూ: ‘దారికాచి వీలుచూచి కాదు’ అనే పాట ఇందులోనిదే)
  9. నటుడు చంద్రమోహన్ తొలిసారిగా పరిచయమైన సినిమా ‘రంగుల రాట్నం’ (1967). బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మునిసిపల్ చైర్మన్ పాత్ర పోషించినదెవరు?
  10. ఎన్.టి.ఆర్. దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కాంతారావు, కె.ఆర్. విజయ, ఉదయకుమార్, ఎస్. వరలక్ష్మి నటించిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’ (1966) సినిమాలో అర్జునుడిగా శోభన్ బాబు నటించగా, ద్రౌపదిగా నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 డిసెంబర్ 03వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 117 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 డిసెంబర్ 08 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 115 జవాబులు:

1.మాలతి (పాతాళభైరవి హీరోయిన్) 2. పి. శాంతకుమారి 3. అన్నపూర్ణ 4. కులదైవం 5. మాంగల్యం 6. తాపీ ధర్మారావు 7. ఎల్. మల్లేశ్వరరావు 8. మిక్కిలినేని 9. ఆదుర్తి సుబ్బారావు 10. త్రిపురనేని మహారథి

సినిమా క్విజ్ 115 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మంజులదత్త కె, ఆదోని
  • పి.వి.రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి, ఒంగోలు
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ ముంబయి

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here