సంచికలో 25 సప్తపదులు-25

1
3

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
చేరుతుంది
మారుతుంది
అర్థవంతమైన జీవితం దొరకదు – నిర్మిస్తే తయారువుతుంది

సుధాస్వామి
విశాఖపట్నం

2
సేకరణ
విస్తరణ
మనసుపెట్టి చేసిన పనికి ఫలితం ఆదరణ

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

3
పిలవకు
కొలవకు
అక్రమము, అధర్మము అన్యాయములను మనసులో తలవకు.

డబ్బీరు ప్రభాకర్,
రాయపూర్.

4
ఘటన
దుర్ఘటన
అన్యాయాలను, అక్రమాలను ఎదురించి చేసేదే.. ప్రతిఘటన.

డి. రమా సత్యా దేవి
కొలకత్తా.

5
ప్రాయం
కాయం
శరీరంలో జీవం అద్భుతమే కానీ – బుద్బుదప్రాయం

YLNV ప్రసాద్ రావు,
విజయనగరం.

6
పుణ్యము
నైపుణ్యము
విద్యలను సేవాభావంతో వినియోగించటం ఎల్లప్పుడూ అగ్రగణ్యము

డా. పి. వి. రామ కుమార్
హైదరాబాద్

7
సాధన
ఆస్వాదన
కవిత సృజించాలంటే పడాలి ప్రసవ వేదన.

ఆర్ ఎస్ రాజకుమార్
విశాఖపట్నం

8
బంధం
అనుబంధం
వేషభాషలు వేరైనా మనుషులను కలిపేది ఋణానుబంధం

ద్రోణంరాజు వెంకట్రామయ్య
హైదరాబాదు

9
పరుగు
వరుగు
రాను రాను మనిషిలోని సున్నితత్వం కనుమరుగు

డాక్టర్ శైలజ మామిడాల
హనుమకొండ

10
భయం
నయం
భక్తితో స్మరిస్తే ఇచ్చును దైవం జయం

జె.విజయకుమారి
విశాఖపట్నం

11
ఎంతటిదైనా
ఎలాంటిదైనా
సాగిపోతారు తలవంచక ధీమంతులు సమస్య ఎవరిదయినా

శ్రీమతి ఎస్. కమలా దేవి,
మాదాపూర్, హైదరాబాదు.

12
కోపం
తాపం
వృద్ధాప్యంలో జబ్బులకు కారణం పౌష్టికాహారం – లోపం

వై.పద్మ.
హైదరాబాద్

13
అప్పు
కొప్పు
పెరిగిన కొద్దీ మిగులు తలభారం ముప్పు

ఎన్. ఎస్ యోగానంద రావు
చెన్నై

14
సామంతులం
కీర్తిమంతులం
సంపదల్ని మనం శాసించగలిగితేనే నిజమైన శ్రీమంతులం

శ్రీవాణి
తెనాలి

15
ఉత్తుత్తి
ఉత్పత్తి
నిరంతరం పెరుగుతునేవుంది రాష్ట్రాల్లో నిరుద్యోగుల నిష్పత్తి

ధరణికోట శివరామప్రసాద్,
హైదరాబాద్

16
తాగునీరు
సాగునీరు
కాలుష్యపు కోరల్లో జలనిధులు – గగనకుసుమం మంచినీరు.

పట్నాల ఈశ్వరరావు
విజయనగరం

17
జంకులు
గొంకులు
ఆలుమగల మధ్య ఉండరాదు ఎటువంటి టకటొంకులు!

ఎన్. ఆర్. తపస్వి
చెన్నై

18
కోతులు!
నీతులు!!
సర్వకాలమందు ఆచరించతగ్గ మేలుకొలుపు చిహ్నమే మూడుకోతులు!!!

నేమాన సుభాష్ చంద్ర బోస్,
విశాఖపట్నం

19
ప్రభావం
ముభావం
విడనాడాలి మనం ప్రశంసలను ఆశించే స్వభావం

నెల్లుట్ల శ్రీనివాసులు
చెన్నై

20
స్వార్థం
అనర్థం
అక్రమాలతో ఆర్జన ఎవరికీ కారాదు పరమార్థం

శాంతమూర్తి
హైదరాబాద్

21
కసురు
విసురు
ఏది మితిమీరినా మనుజులు బాసేరు ఉసురు

డాక్టర్ వరలక్ష్మి హరవే,
బెంగుళూరు

22
అల
కల
ఆటుపోట్లతో కల్లోలమయితే మిగిలేది నిస్పృహనే ఇల

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

23
సలక్షణo
అనుక్షణం
పవిత్రమైన మనసుచెయ్యాలి దేవునిచుట్టూ ప్రదక్షిణం

పార్లపల్లె.నాగేశ్వరమ్మ.(టీచర్)
నెల్లూరు

24
వేదన
ఆవేదన
భక్తుడు భగవంతునితో మొరబెట్టుకునే అంతరంగపు నివేదన

రావెల పురుషోత్తమరావు
అమెరికా

25
అక్కడ
ఇక్కడ
శివనామ స్మరణతో తరించిపోని భక్తజనం ఎక్కడ

ఎస్.గిరిజశివకుమారి
గుంటూరు

~

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here