[box type=’note’ fontsize=’16’] ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా యువకవి సామల ఫణికుమార్ అందిస్తున్న కవిత “ఆచార్యా… అహర్నిశలు పాటుపడ్డావా”. [/box]
[dropcap]గు[/dropcap]రువంటె గుణమున మిన్న
గురువుకి సాటి ఇంకేముందన్నా
లోకం తెలియని పసివాడైనా…
లోకాలేలే పై వాడైనా
ఆది గురువు నీ తల్లిని మొదలు
ఆహ్లాదాల పలుకులు వదులు
జ్ఞానం పంచే ప్రతి ఒక్కరిలో
కొలువుండేది గురువే కదా!!
కనిపించె దైవాలు తల్లిదండ్రులైతే
నడిపించే దైవం గురువు
ఎన్ని వందల వృత్తులున్నా…
అందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి