[box type=’note’ fontsize=’16’] “స్వచ్ఛ భారత్‍కి దేవుడిచ్చిన అంబాసిడర్ కాకి” అంటున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. [/box]
[dropcap]కా[/dropcap]వు కావు అంటూ అరుస్తుంది
కావుమని అడిగినా కాచేవాడు లేక
ఎంగిలి విస్తరాకులు వెతుకుతుంది
ఇది అరిస్తే చుట్డాలొస్తారని గట్టిగా
హుష్ కాకీ అని అదిలించేస్తారే
ఊరిలో చెత్తని తిని శుభ్రం చేసి
మేలు చేసే కాకి, స్వచ్ఛ భారత్‍కి
దేవుడిచ్చిన అంబాసిడర్ కదా