అమెరికా నానీలు!

0
4

[box type=’note’ fontsize=’16’] అమెరికా ద్వంద్వవైఖరులను కవితాత్మకంగా వివరిస్తున్నారు వెన్నెల సత్యం “అమెరికా నానీలు!”లో. [/box]

[dropcap]నా[/dropcap]లుకపై స్వదేశీ
నాట్యమాడుతుంది
మనసు విదేశీ
విహారం చేస్తుంది

°°°°°°°

అమెరికా మంచిదే
యుద్ధం వస్తే
పక్కోడికీ మనకు
ఆయుధాలమ్ముతుంది

°°°°°°°°

భారతంటే
భయం లేదు వాడికి
ఉత్తర కొరియా అంటే
ఉచ్చోసుకుంటాడు

°°°°°°°°°

మనోళ్ళని అమెరికా
వెళ్ళగొడుతున్నా
మనకు అది
భూతల స్వర్గం

°°°°°°°°

అమెరికా కళ్ళకి
రెండే కనిపిస్తాయి
ఆయుధాలు
ఆయిల్ నిల్వలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here