కుంపటి

0
10

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘కుంపటి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కుం[/dropcap]పటిని రాజేయు విధానం
ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంధానం
కుంపటంటే.. కుంపటి కాదు
నిష్ఠాగరిష్ఠల అగ్ని హోత్రము
నిత్యకర్మల సత్యసూత్రము

నీడలా అంటి పెట్టు కొని
కలిమిలో నైనా లేమిలో నైనా
సహవాసముంది ఉపవాసముంది
నిజ నిరూపణకు జ్ఞాపకాలు తప్ప
ఋజువర్తనకు ఆనవాళ్ళు లేవు

అద్భుత నగల తయారికి
మొండికేయ లేదు మొరాయించ లేదు
సహకరించింది ఉపకరించింది
నిదర్శనకు నైపుణ్యం తప్ప
ప్రదర్శనకు ప్రగల్భాలు లేవు

కుంపటి పరంపర ఆగతమై
సాక్ష్యాధారమైంది మోక్షాధారమైంది.
చరిత్రగా మిగిలింది చరితార్థమైంది.
సెగల తీవ్రత నగలకు తప్ప
ఒలకబోసే వగలకేమి తెలుసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here