‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. 1977లో గిరిబాబు నిర్మాతగా వచ్చిన తెలుగు సినిమా. 1976 నాటి హిందీ సినిమా ‘నాగిన్’ కు రీమేక్ (9) |
6. మెట్టతామర, మరిది, దేవరుడు (2) |
7. ప్రయాణములో ఒక అక్షరం లేదు (3) |
9. పుట్టుక, సమూహము, కులము – మొదలు కోల్పోయి, తరువాతి అక్షరాలు వెనుకా ముందు య్యాయి (2) |
10. తిరగబడిన బొంకు, అసత్యము (2) |
13. కుడి నుంచి ఎడమకి వచ్చిన కమ్మరి (4) |
14. వెనక నుంచి ముందుకు వచ్చిన కృష్ణుడి కన్నతండ్రి (4) |
15. చేమటిఆవు (చిత్రవర్ణముగల ఆవు)లో 1, 5 అక్షరాలు (2) |
16. గ డు సు కీ ర ము – లో నుంచి 4, 3, 1 (3) |
18. బ్రహ్మ, శివుడు, విష్ణువు, పరమాత్మ (5) |
21. ముఖం, కుడి నుంచి ఎడమకి (3) |
22. పెంపుడు, స్వీకారం (3) |
23. గొప్ప ఋషి (3) |
25. తారుమారయిన కొండబిలము, గుహ (3) |
26. నుతించబడినది (2) |
27. మనసు, కోరిక, దయ, హృదయము (2) |
28. అతడు, అలయు, ఎండు, కఱవు (2) |
30. అటుగా వచ్చిన మరిది, (అటు నుంచి – జూ. ఎన్.టి.ఆర్. ఇటీవలి సినిమా) (3) |
32. అందమైనది, నిగవు (2) |
33. గాంధారిని తనలో దాచుకున్న ఒక రాగం (5) |
34. భవిష్యత్తు, భవితము (2) |
నిలువు:
1. కల్పవృక్షము, వేల్పుఁజెట్టు (5) |
2. అత్రినేత్రజుడు, చంద్రుడు – చివరి అక్షరం ప బదులు వ వచ్చింది (6) |
3. అశ్వశాల (3) |
4. రాలేము, మేము రావడం లేదు (2) |
5. వింధ్య పర్వతం (2) |
6. 1973లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఘట్టమనేని కృష్ణ నటించిన చిత్రం. (10) |
8. వ్యాసుడు రచించిన ఒక శాక్తేయ పురాణము (7) |
11. నూరే, శతమే (2) |
12. శ్రీకృష్ణుడు, గోపాలకృష్ణుడు (7) |
14. శరీరము, చక్కని రూపము, దేహము (3) |
17. మిత్రవింద, శ్రీకృష్ణుని భార్యలలో ఒకరు, హరివంశంలో ఈమెను — అని పిలుస్తారు (3) |
18. నారదుడు, దేవముని (3) |
19. అర్జునుడి శంఖం (4) |
20. కింద నుంచి పైకి వచ్చిన కృష్ణుడి మేనమామ (3) |
24. నాశనము, సంహారము, కొట్టబడినది (2) |
28. క్రింద నుంచి పైకి, దేవుడిని పిలవండి (2) |
29. క్రింద నుంచి పైకి రాజ్యము, ప్రదేశము, అనేక పట్టణములు గల ప్రదేశము (2) |
30. తలక్రిందులైన పదును, ప్రవహాం (2) |
31. సస్య విశేషం, శాలిధాన్యము (2) |
32. అమ్మవారు (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 24 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 146 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 డిసెంబర్ 29 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 144 జవాబులు:
అడ్డం:
1.పిట్ట కొంచెం కూత ఘనము 6. కయిచూర 7. ముకడగు 8. దౌ 9. దర్పం 10. భా 11. చో 12. రంగు 14. మా 16. హ్మబ్రరప 17. గలగలా 19. గోడ మీద పిల్లిలా
నిలువు:
1.పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం 2. కొండచూలి 3. కూకీ 4. ఘటకము 5. ముసుగులో గుద్దులాట 13. పరగడ 15. పాలవెల్లి 18. ఎద
సంచిక – పద ప్రతిభ 144 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మంజులదత్త కె, ఆదోని
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి.రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.