అందరూ విజేతలే

2
2

[dropcap]సం[/dropcap]చిక ఎంతో ఉత్సాహంతో కథలు, కవితల పోటీలు ప్రకటించింది. హాస్యకథల పోటీ గడువు ముగిసింది. ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది.

హాస్యకథలకు అనుకున్న రీతిలో స్పందన రాలేదు. సంచిక ఇంకా కొత్త పత్రిక. ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తోంది. కాబట్టి, హాస్యకథలపోటీ గురించిన విషయం అందరివరకూ చేరివుండకపోయి వుండవచ్చు. అందుకని ఆశించినన్ని రచనలు అందలేదు. అందుకని సంచిక టీమ్ ఒక నిర్ణయం తీసుకుంది. పోటీకి వచ్చిన కథలు కొన్నే అయినా కథకులు ఎంతో ఉత్సాహంగా పోటీకి కథలు పంపారు. కాబట్టి, అన్ని కథలను ఉత్తమ కథలుగా నిర్ణయించి, పోటీకి కథలు పంపిన రచయితలందరికీ రూ.1000/- ప్రోత్సాహక బహుమతిగా అందచేయాలని సంచిక టీమ్ నిర్ణయించింది. కొందరు కథకులు ఒకటి కన్నా ఎక్కువ కథలు పంపారు. వారికి ఒక కథకే బహుమతి లభిస్తుంది. కథలు వారానికి రెండు చొప్పున త్వరలో సంచికలో ప్రచురితమవుతాయి. రచయితలు, కథల వివరాలు:

  1. మతిమరపుకు మందు – పులిగడ్డ విశ్వనాథరావు
  2. బామ్మగారు-పెంకుముక్క – కె వీ సుబ్రహ్మణ్యం
  3. నాటకం అటకెక్కింది – బొందలనాగేశ్వరరావు
  4. కమరావతీరాగం – వాగుమూడి లక్ష్మీ రాఘవ రావు
  5. సుందరమూర్తి, సలోచనల కళాపోషణ – అందె మహేశ్వరి,
  6. విరంచి రచించని రోజు – అందె మహేశ్వరి
  7. కట్లపాము కాదు పొట్లకాయే – గంగాధర్ వడ్లమన్నాటి
  8. అంత బాగుందా అయితే సరే – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
  9. తత్ దినం – విజయాదిత్య
  10. నేనూ- ఒక అమెరికా పనిమనిషీ – స్వాతీ శ్రీపాద
  11. ఫణీంద్రశర్మగారి శిష్యరికం – సామల ఫణి కుమార్
  12. నిమిత్తమాత్రులు – పొన్నాడ సత్య ప్రకాశరావు
  13. వదిన – వంటల షో.. – జి.యస్.లక్ష్మి
  14. అచ్చిబాబు పెళ్ళి – శిరీష గిరిధర్
  15. ఫేసుబుక్కు పేర్రాజు – ఆనందరావు పట్నాయక్

ఈ రచయితలందరినీ తమ తమ బ్యాంకు ఎకౌంట్ వివరాలను సంచిక సంపాదకులకు ఈమెయిల్ ద్వారా పంపమని కోరుతున్నాము. బ్యాంకు ఎకౌంట్ వివరాలుంటే పురస్కారం నగదును వారి ఖాతాలోకి బదిలీ చేయడానికి వీలవుతుంది. ఈ పోటీలో పాల్గొన్నవారందరికీ అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here