భూమి నుంచి ప్లూటో దాకా… -16

0
4

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 41: చీకట్లో సుదూర ప్రయాణం

[dropcap]చ[/dropcap]ల్లగా ఉంది. బాగా చల్లగా ఉన్నట్టు అనిపించింది. తర్వాత నన్ను గాలిలో రవాణా చేస్తున్నటు అనిపించింది. నేను అంతరిక్షంలో తేలుతున్నట్టు తోచింది. చాలా సేపటి నుంచి తల తిరుగుతున్నట్టు, తలనొప్పిగా ఉన్నట్టు అనిపిస్తోంది. మెల్లిగా కళ్ళు తెరిచాను. చూస్తే నేనొక గాజు పేటికలో ఉన్నాను.  కొన్ని క్షణాల తర్వాత పేటిక తెరుచుకుంది, రెండు తెల్లని ఆకారాలు వచ్చి నా ముందు నిలబడ్డాయి. ఆసుపత్రులలో సిబ్బంది వేసుకునే ఆకుపచ్చ దుస్తుల్లాంటి దుస్తులతో తమ శరీరాలని పూర్తిగా కప్పుకున్నాయా ఆకారాలు.

నా ముంజేతికి రెండుసార్లు ఏదో సూదిమందు ఇచ్చారు. చల్లని గాలి ప్రవేశించినట్లయింది.

అప్పుడే పేటిక తలుపు మూతపడింది.

నేను మరొక ప్రపంచానికి ఎగిరిపోతున్నాను. నేను నిద్రపోతున్నాను. నాకు ఆమ్రపాలి కనబడుతోంది, మర్రి చెట్టు, కొండపై ఉన్న ఆలయం, సిగలో మందార పువ్వులతో ప్రకృతి,  ఉన్నట్టుండి నల్లటి దుస్తులు ధరించిన పొడవైన అస్థిపంజరాలు ఎదురై వింతైన భాషలో మంత్రాలు ఉచ్చరించడం…

సుమారు కొన్ని గంటలపాటు కలత నమేము  ఇదంతా నేను మునుపెన్నడు అనుభవించనిది. నేను పూర్తిగా నిద్రలోకి జారిపోయాను.

***

గాఢనిద్రలో ఉన్నప్పుడు కథ చెప్పడం చాలా కష్టం.

గ్రహాంతర తాంత్రికుల వింత మంత్రోచ్చారణ వినిపిస్తుండగా నాకు స్పృహ వచ్చింది.

వారు మంత్రాలను పఠిస్తున్నారు, గట్టిగా ఉచ్చరిస్తున్నారు. మంత్రోచ్చారణ మొదట నెమ్మదిగా, గొణుగుడులా వినబడింది… కానీ క్రమక్రమంగా తీవ్రత పెరిగింది. భీకరమైన భరించలేని ధ్వనితో నా చెవులు బద్దలయ్యాయి!

నేను కళ్ళు తెరవాల్సి వచ్చింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ తెరిచాను. ఆపై పూర్తిగా స్పృహలోకి వచ్చాను.

అందరూ ఎక్కడ ఉన్నారు?  ప్రియాతి ప్రియమైన నా జీవిత భాగస్వామి ప్రకృతి,  ఇంకా నా లోహ మిత్రుడు యురేకస్ ఎక్కడ?

నా ముందు, వెనుక, పక్కల… అంతా గాజే. నా చుట్టూ తెల్లని మంచు బిందువులు ఉన్నాయి. విపరీతమైన చలిని అనుభవిస్తున్నాను.

నా శరీరాన్ని చూస్తే – బిగుతుగా ఉన్న బూడిద రంగు సింథటిక్ సూట్లు నా శరీరాన్ని అతుక్కుని ఉన్నాయి. నా ఛాతిపై వైర్లు ఉన్నాయి, చేతికి ఐవి సూదులు ఉన్నాయి, ఆహారం కోసం నోట్లో ఒక గొట్టం, మూత్రం కోసం ఇంకో ట్యూబ్ ఉన్నాయి. నేను అద్దాల గుండా చూచినప్పుడు – నీలం గోడలు మరియు తెల్లటి పైకప్పు ఉన్న ఓ కారిడార్లో మరికొన్ని వరుసగా కనబడ్డాయి.

ఏడు అడుగుల పొడవైన ఎత్తైన గాజుపేటికలు.

నాకిప్పుడు ఇదంతా అర్థమైంది. తెల్లరంగు కోట్లు, మాస్క్‌లు ధరించిన ఇద్దరు పురుషులు, తెల్లటి యూనిఫాం వేసుకున్న ఒక నర్సు మందుల ట్రాలీతో గదిలోకి ప్రవేశించి నా దగ్గరకు వచ్చారు.

గాజు పేటిక తలుపు తెరిచారు. తెల్లని మంచు బిందువులతో కూడిన చల్లని ఆవిరి గాజుపేటిక నుంచి బయటకు పోయింది.

“హాయ్! హనీ! స్వాగతం! ఎలా ఉన్నారు? నిజానికి మీరు బావున్నారు. మీ ఆయువుపట్లన్నీ అంటే నాడి రక్తపోటు  లాంటి వైటల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు, దయచేసి నెమ్మదిగా బయటకు అడుగు పెట్టండి!!!.”

ఒక నర్సు నా శరీరం నుండి గొట్టాలను వేగంగా తొలగిస్తోంది.

గడ్డ కట్టిన టర్కీ కోడి ని రిఫ్రిజిరేటర్ నుండి బయటకు తీస్తున్నట్లుగా అనిపించింది.

నెమ్మదిగా బయటకి వచ్చాను. మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పుడు నా గొంతు మెటల్ రోడ్డు మీద తుప్పు పట్టిన ఇనుము చక్రం వెళ్తే ఎలాంటి ధ్వని వస్తుందో… అలా ముతకగా పలికింది.

“నేను ఎక్కడ ఉన్నాను! ఏం జరిగింది? నేను స్తంభింపబడ్డానా? “

“నువ్వు సరిగ్గా ఊహిస్తున్నావు! సూదూర ప్రయాణం కాబట్టి మిమ్మల్ని ఘనీభవింపజేశాం! తద్వారా నీ జీవక్రియలు మందగించడంతో పాటు ఆహారం, ఆక్సిజన్ అవసరాలు చాలా తక్కువగా ఉంటాయి… అసలు ఉండవు కూడా. క్యాసిని స్పేస్ ప్లాట్‌ఫామ్ నుంచి సుదీర్ఘంగా ప్రయాణించాం. దాదాపు 10 సంవత్సరాలు. ఆల్ఫా సెంటారి వ్యవస్థలోని మా కెప్లర్ గ్రహానికి చేరడానికి చాలాకాలం ప్రయాణించాలి.”

వాస్తవం గ్రహించి విస్తుపోయాను.

 సుదూరాలలోని డీప్ స్పేస్ ట్రావెల్ కోసం ఐస్ చాంబర్‌లో నిద్రాణస్థితికి చేర్చి తీసుకువెళ్ళడం ఇప్పుడు ఆమోదనీయమైన విధానమే.

“ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం?”

“హా! హా! హనీ!” అంటూ గట్టిగా నవ్వారు అప్పుడే లోపలికి ప్రవేశించిన అస్థిపంజరాల్లాంటి ముగ్గురు మాంత్రికులు.

వాళ్ళు కూడా ఇప్పటికీ తెల్ల మంచు ఆవిరిని వెలువరిస్తున్నారు.

“మానవా! తప్పుగా అర్థం చేసుకోకు! మేము మా ప్రాంతానికి తిరిగి వెడుతున్నాం. ఆల్ఫా సెంటారీలోని కెప్లర్‌కి 5 కాంతి సంవత్సరాల దూరం, అంతే. కాబట్టి మేం సమూరాకి ఏదో చిన్న సాయం చేస్తున్నాం” అన్నారు.

“నేను ఎక్కడ…. ఎక్కడ… నేను?” అరిచాను. “నా జట్టులోని మిగతావాళ్ళంతా ఎక్కడ ఉన్నారు?”

అస్థిపంజర మాంత్రికుల నాయకుడు (నాకు అతని పేరు తెలియదు) ఇలా అన్నాడు:

“హనీ! మీరు ఆల్ఫా వ్యవస్థలో లేరు. మీరు అక్కడికి రాలేరు. ఇది సౌర వ్యవస్థ యొక్క వెలుపలి అంచులో ఉన్న క్యూపర్ బెల్టు. మనం సమూరా యొక్క చివరి అధికారం కేంద్రానికి సమీపిస్తున్నాం… నెప్ట్యూన్ – ప్లూటో ప్రాంతం! ఇక్కడ ఓ చిన్న స్పేస్ ప్లాట్‌ఫామ్ ఉంది. మేము నీ నుంచి ఓ చిన్న సాయం కోరుతున్నాం. హా! హా! ఎంపికైన వ్యక్తివి కదా! ఆ చివరి అద్భుత వస్తువు ఎక్కడు ఉందో గుర్తించు!”

నేను ఆశ్చర్యంతో మూగపోయాను.

క్యూపర్ బెల్ట్! ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్… వంటి అనేక మరుగుజ్జు గ్రహాలతో… సౌర వ్యవస్థ యొక్క వెలుపలి అంచు.

“వాస్తవానికి మనం నెప్ట్యూన్ – ప్లూటో ప్లాట్‌ఫామ్‌పై ఆగిపోతాం. చివరిది, అత్యంత శక్తివంతమైన ఆ అద్భుత వస్తువు కోసం ఉపగ్రహాలను వెతుకుతాం. సమూరా కోసం ఏడవ అద్భుత వస్తువు.. “

దేవుడా. నేను ఆశ్చర్యపోయాను. “ట్రైటాన్” అని అరిచాను.

“ట్రైటాన్?”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here