రైలు మాతా

2
2

[box type=’note’ fontsize=’16’] రైలుని తల్లిగా భావించి, భారతీయులకు రైళ్ళు ఎంతలా ఉపకరిస్తున్నాయో మామిడి గణపతి రావు వివరిస్తున్నారు “రైలు మాతా” అనే కవితలో. [/box]

[dropcap]అ[/dropcap]హో రైలు మాతా, బహు బాగున్నది నీ తియ్యని కూత
దేశ విదేశీయులను చేర్చుతావు వారి గమ్యం
ఎవ్వరితో లేదు నీకిక సామ్యం                           (అహో రైలు మాతా)

పెద్దవారని, పేదవారని లేదు నీకు భేదం
అందర్ని కలుపుకుంటూ చేస్తావు మోదం                   (అహో రైలు మాతా)

లోకంలోని మూడు తరగతుల మాదిరే
నీలోనూ ఉన్నవి ఏసి, రిజర్వేషన్, జనరల్                 (అహో రైలు మాతా)

ప్రయాణికులకు నీవే కదా చక్కని ఊత
నీవు కదులుతున్నావని చెపుతుంది నీ తియ్యని కూత    (అహో రైలు మాతా)

పచ్చజెండా ఊపితే ఎగిరిగంతేస్తావెందుకు?
యర్రజెండా ఏమి పాపం చేసింది, చూపితే ఠక్కున ఆగుతావు     (అహో రైలు మాతా)

కాలకృత్యాలను తీర్చుకోవచ్చు నీలో
కాలాన్ని వెనుకకు నెట్టుతావు మాలో                      (అహో రైలు మాతా)

సుదూర ప్రాంతాల వారు చేరారు నీ దరి
సుందర ప్రపంచాన్ని చూడాలని మరి                       (అహో రైలు మాతా)

వారి సుఖ ప్రయాణానికి నీవే కదా ఆధారం
వారి మానసిక గ్లానిని తీరుస్తావు సుతారం                   (అహో రైలు మాతా)

నీతో ప్రయాణించడం మా పూర్వజన్మ పుణ్యం
మాలో నీపై ఉన్నది కూసంత నమ్మకం                     (అహో రైలు మాతా)

రైలు లైన్ ఉన్నందున మాకీ మహద్భాగ్యం
అది లేని ప్రాంతాల వారికి లేదు ఈ భోగ్యం                (అహో రైలు మాతా)

కాలానుగుణంగా మారుతుంది నీ తీరు
బొగ్గు, డీజల్, విద్యుత్, సోలార్ తేరు                    (అహో రైలు మాతా)

కాలుష్యాన్ని పారద్రోలాలన్న నీ చింతన
మాలోనూ పెంచు కల్మషరహిత పొంతన                     (అహో రైలు మాతా)

ఉగ్రవాద ఉగ్రవాదభూతం కన్నేసింది నీపై
విలువైన జన జీవితాల ముంచింది మాపై                    (అహో రైలు మాతా)

వివిధ భాషా భేదాల ప్రయాణికుల నీ చల్లని ఒడి
హావ భావాలను వ్యక్తపరిచే చక్కని బడి                      (అహో రైలు మాతా)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here