[box type=’note’ fontsize=’16’] అందమైన సాయంత్రపు అనుభూతిని ఆహ్లాదంగా వర్ణిస్తున్నారు డా. విజయ్ కోగంటి “ఈ సాయంత్రపు వేళ” కవితలో. [/box]
[dropcap]తి[/dropcap]రిగి తిరిగి ఒడ్డుకు చేరి
కాసింత విరామానికై
ఎడాపెడగా నిలిచిన
ఆలోచనల పడవలు
ఒడ్డున చేరిన గవ్వలకు
లోతైన అనుభవాలను
చేరవేస్తూ
మనసు అలలు
అప్పుడే అడవి అంతా చుట్టి
పూల పరిమళాన్ని
పొదువుకొచ్చిన
వాన నవ్వుల గాలి పరవశం
ఈ సాయంసంధ్యలో
యేటి వడ్డున నీడలమై
నీవు,నేను,
మన ఆలోచనల అడుగులు