[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం. తేజస్వి వ్రాసిన కథ “అతి ప్రేమ ప్రమాదకరం“. పిల్లల్ని అతిగా గారాబం చేస్తే, అది వారికే నష్టమని చెప్పే కథ ఇది. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]
[dropcap]ఒ[/dropcap]కానొక ఊరిలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ఒక అద్భుతమైన సముద్రం దగ్గర ఉండేది. ఆ ఇంట్లో ఒక అందమైన కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అమ్మ సుజాత, నాన్న సునీల్, తాత గిరి, నాయనమ్మ రమణమ్మ. పెద్ద అబ్బాయి శౌర్య, చిన్న అబ్బాయి ఫణి ఉంటారు.
శౌర్యకు చిన్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం వలన ఎడమ చెయ్యి కొద్దిగా విరిగి వంకర అయ్యింది. దానితో అందరూ ఫణినే ముద్దుగా గారంగా చూసుకోవడం మొదలుపెట్టారు. శౌర్యని దూరం పెట్టేవారు. అన్ని ఫణికే కొనిచ్చేవారు. పాపం శౌర్య చాలా బాధపడేవాడు.
కాని రమణమ్మ మాత్రం మొదటి నుంచి శౌర్యనే ఇష్టపడేది ఎందుకంటే ఫణి పిసినారివాడు. నాయినమ్మ శౌర్యకి ఏవీ కొనివ్వలేకపోయినా మంచి విద్యను, ఈత, చెట్లెక్కడము, ఆటలు వంటివి ఎన్నో నేర్పించింది. కాని ఫణి మాత్రం ఒక మొద్దు. ఎప్పుడు తిండి నిద్ర మాత్రమే. మంచం నుంచి కాళ్ళు కూడా క్రింద పెట్టేవాడు కాదు. ఫణి చెయ్యలేకపోయిన ప్రతి దానిలో శౌర్యనే గెలిచేవాడు.
ఒక రోజు హోరుమంటూ వర్షం పడుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. హటాత్తుగా సముద్రంలోని నీళ్ళు అన్ని ఊరి మీదకు వచ్చేశాయి. మొదట సముద్రం దగ్గర ఉన్న ఇళ్లు అన్నింటి మీదకీ నీళ్లు వచ్చాయి. ఈత వచ్చిన వాళ్ళంతా తప్పించుకున్నారు. శౌర్య వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఫణికి తప్ప అందరికి ఈత వచ్చు. రక్షించడానికి ఎంత ప్రయత్నించినా అతడిని కాపాడలేకపోయారు. ఫణి నీళ్ళలో మునిగి పోయాడు. అందరూ బయటకి వచ్చిన తరువాత చాలా బాధపడ్డారు. “ఫణిని కూడా శౌర్యలాగే చూసుకుంటే ఫణి కూడా బ్రతికేవాడు కదా!” అని అందరూ బాధపడ్డారు.
“అతి ప్రేమ ప్రమాదకరం” అని రమణమ్మ మనసులో అనుకుంది.