అ దగ్గరే ఆగిపో

0
4

[box type=’note’ fontsize=’16’] అక్షరామాలలో ‘అ’ దగ్గరే ఎందుకు ఆగిపోవాలో చెబుతున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. [/box]

అ అక్షరం
అమ్మ లాంటిది
అంతు లేని
అనురాగం
అభిమానం
అందిస్తుంది

అ అక్షరం
అనంతం
అద్వితీయం
అపురూపం
అక్షయం
అ ని దాటి ముందుకు వెళ్తే

ఆకలి
ఇక్కట్లు
ఈర్ష్య
ఉసురు
ఊడిగం
ఎగతాళి
ఏడుపు
ఐతే గియితే
ఓటమి వస్తాయి

అ దాటి ముందుకు వెళ్ళి
నీ ఆక్రందన వినిపిస్తే
ఎనిమిది చెవుల బ్రహ్మకి
బ్రహ్మ చెవుడు వస్తుంది

అక్షరమాలంతా వద్దు
అ దగ్గరే ఆగిపో
అ వర్ణమే అర్ణవము
అంతు లేని ఆనందానికి
అది ఒక సంకేతము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here