46. మాతృభాష – మాతృభూమి

0
4

[box type=’note’ fontsize=’16’] 2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత. [/box]

[dropcap]మా[/dropcap]తృ భాష అతనికి దూరంలో –  అతను పరభాష ఊబిలో .
మాతృభూమి ప్రకృతికి దూరంలో – భూమాత ప్లాస్టిక్ ఊబిలో.
మాతృ భాషను విడిచి వెళ్తున్న అతను – పరభాషా వ్యామోహం వద్దంటున్న అంతరంగం.
మాతృభూమిని విడిచి వెళ్తున్న ప్రకృతి – ప్లాస్టిక్ వ్యామోహం వద్దంటున్న భూమాత అంతరంగం.
మాతృభాషకు అతను సుదూరం – అందుకే పరభాష ఎంతో మధురం.
మాతృ భూమికి ప్రకృతి సుదూరం – అందుకే ప్లాస్టిక్ ఎంతో మధురం.
మాతృభాష శబ్ద సౌందర్యం ఆ రోజుల్లో మైమరపించింది – నేడు ఆ శబ్ద సౌందర్యం మూగవోయింది.
మాతృభూమి ప్రకృతి సౌందర్యం ఆ రోజుల్లో మురిపించేది – నేడు ఆ ప్రకృతి కృంగిపోయింది.
మాతృభాషయే ఆనాడు దేశభాషలందు లెస్స – నేడు వెనుకపడిపోతున్నామన్న బిడియము.
మాతృభూమి ఆనాడు పంచభూతములందు లెస్స – నేడు క్షిణించిపోతున్నామన్న సంకోచము.
మాతృ భాషలో తీయదనాన్ని గుర్తుతెచ్చుకోండి – క్షీణించి పోతున్న తేట తెనుగుకు పునర్జీవనం కలిగించండి.
మాతృ భూమిలో ప్రకృతిని గుర్తు తెచ్చుకోండి – క్షీణించి పోతున్న పచ్చదనానికి పునర్జీవనం కలిగించండి.