[dropcap]సం[/dropcap]చిక వెబ్ పత్రిక నిర్వహించిన దసరా కవితల పోటీకి తమ కవితలను పంపి పోటీని విజయవంతము, అర్ధవంతము చేసిన సహృదయులయిన కవులందరికీ బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. పోటీ అన్నది కేవలం సామాన్యంగా వాడేపదం.. అలాగే విజేతలన్నది కూడా పోటీ వుంది కాబట్టి వాడే పదం. కానీ, నిజానికి ఇలాంటి సాహిత్య పోటీల్లో గెలిచేది సాహిత్యమే!!!! ఈ పోటీల్లో పరాజితులంటూ వుండరు.
ఈ పోటీల నిర్వహణలో రెండు రకాల బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాము. దాని వెనుక ఒక కారణం వుంది. సాధారణంగా పత్రికలు నిర్వహించే పోటీల్లో ఎప్పుడూ కొందరికే బహుమతులు రావటం అందరికీ అనుభవమే. అంతేకాదు, ఒకొసారి బహుమతి పొందిన రచనలు చదువుతూంటే ఆ రచనలకు బహుమతులు ఎలా ఇచ్చారో???? అని ఆశ్చర్యపడుతూండటమూ అనుభవమే. అందుకే, వీలయినంత పారదర్శకంగా పోటీలు నిర్వహించాలని నిశ్చయించాము. ఫలితంగా, న్యాయనిర్ణేతలు తమ దృక్కోణంలో మూడు ఉత్తమ కవితలను ఎంచుకుంటారు. ఆధునిక యాంత్రిక పరిజ్ఞాన్ని ఉపయోగించి పాఠకులు తమ వోటు ద్వారా తమకు నచ్చిన కవితలను ఎంచుకుంటారు. ఏ కవితకు అధికంగా వోట్లు వస్తాయో ఆ కవిత ఉత్తమ కవిత అవుతుంది. అలా, పాఠకులు మెచ్చిన మూడు కవితలు ఉత్తమ కవితల బహుమతి అందుకుంటాయి. ఇందువల్ల, పోటీకి వచ్చిన రచనలన్నీ పాఠకుల ముందు ఉంటాయి. దాంతో తమ రచన ఎంపికయిన తరువాత అది ఎప్పుడు ప్రచురితమవుతుందోనని సంవత్సరాల తరబడి ఎదురుచూపులు రచయితలకు తప్పుతాయి. పాఠకులకు సైతం అన్ని రచనలు చదివి పోల్చుకునే వీలుంటుంది.
అయితే, ఇక్కడ ఒక సమస్య వస్తుంది. పాఠకుల అభిప్రాయం, న్యాయనిర్ణేతల అభిప్రాయం ఒకటే అవవు. ఎందుకంటే పాఠకుల దృష్టి వేరు. న్యాయనిర్ణేతల దృష్టి వేరు. న్యాయనిర్ణేతల్లా, ఔచిత్యము, శైలి, కల్పనా సామర్ధ్యము వంటి వాటితో సహా ఇతర సాంకేతిక అంశాలను సామాన్య పాఠకుడు పరిగణించడు. కాబట్టి వారిద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా వుండటంలో ఆశ్చర్యం లేదు. కానీ, ఇలా రెండు బహుమతులు పెట్టటం వల్ల అటు పండితులు మెచ్చే రచనలు గుర్తింపు పొందుతాయి, ఇటు పాఠకులు మెచ్చే రచనలకూ ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ఉద్దేశ్యంతో రెండు రకాల బహుమతులను ఏర్పాటు చేశాము.
వీటితో పాటూ సంచిక సంపాదక వర్గం అయిదు ప్రోత్సాహక బహుమతులనిస్తుంది. ఈ రకంగా ఉత్తమ రచనకు ఉత్సాహ ప్రోత్సాహాలిస్తూ, ఒక పారదర్శకమయిన రీతిలో ఉత్తమ రచనలను ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పోటీలు నిర్వహించాము.
పోటీలకు సంతృప్తి కరమయిన సంఖ్యలో కవితలు అందాయి. అందిన కవితల వివరాలు:
S.No. | Title | Author |
1 | నిర్లక్ష్యానికి సాక్షిగా | సింగిడి రామారావు |
2 | బంగారు భవిత | సింగిడి రామారావు |
3 | కవితావనిత | సాయి మాధవ్ |
4 | వాయుసంద్రాలతో వెదురు రంధ్రాలు | సాయి మాధవ్ |
5 | చలి మింగిన పులులు | ఎస్. రవికుమార్ |
6 | చినుకు-చిగురు | సాయి మాధవ్ |
7 | తుమ్మెద ఎద | సాయి మాధవ్ |
8 | మంచు మాటలు | సాయి మాధవ్ |
9 | ఫోనొకటి చేతికొచ్చాక | చొక్కాపు లక్ష్ము నాయుడు |
10 | కంచె | చొక్కాపు.లక్ష్ము నాయుడు |
11 | నాన్న గారి జేబు! | వెన్నెల సత్యం |
12 | ఎదురుచూపు | డా. సమ్మెట విజయ |
13 | కర్చీఫ్ | వెన్నెల సత్యం |
14 | వనితా..వందనం! | వెన్నెల సత్యం |
15 | బాటసారి | సంజు హనీ |
16 | మ్యూజియం | చామర్తి భానులింగమూర్తి |
17 | ఈ క్షణవైరాగ్యం | విజయాదిత్య |
18 | చిరునవ్వు | రాధికా నరేన్ |
19 | భరతమాత కోరిక | చిలక వీరయ్య |
20 | చాపలు | చామర్తి సుబ్బలక్ష్మి |
21 | మౌనం | రాధికా నరేన్ |
22 | స్వప్నం | రాధికా నరేన్ |
23 | ఆరాటం | మల్లాది మంజుల |
24 | మారిన ప్రపంచం | మల్లాది మంజుల |
25 | ఆశయ గీతం | శైలజా మిత్ర |
26 | అవని కాకూడదు అగ్నిగుండం | కైపు ఆదిశేషా రెడ్డి |
27 | గ్లోబలైజేషన్ | నామని సుజనాదేవి |
28 | వెన్నెలామృతం.. | శైలజా మిత్ర |
29 | ప్రియ సహచరి | సోంపాక సీత |
30 | మరువలేము మహాత్మా | కుమార రాజు బుర్రి |
31 | రైతన్నా నీకు వందనం | రమ్యశ్రీ భువనం |
32 | స్వాతంత్ర్యమా నువ్వెక్కడ.. | శ్రీమతి శాంతి కృష్ణ |
33 | ఆవిష్కృతి | పరిమి శ్రీరామనాథ్ |
34 | చిదిమిన మొగ్గలు | జయంతి వాసరచెట్ల |
35 | రాఖీ | శ్రీమతి శాంతి కృష్ణ |
36 | చిరునవ్వుకు ఆహ్వానం | మల్లాది మంజుల |
37 | అమ్మభాష నాకు అమృతమయ్యె | భైరవభట్ల శివరాం |
38 | దీపావళి కూలీ | బత్తులూరి నాగ బ్రహ్మాచారి |
39 | అడుగుల సవ్వడి | శ్రీమతి శాంతి కృష్ణ |
40 | కాళ్ళని కళ్లకద్దుకుంటూ… | సోమేపల్లి వెంకట సుబ్బయ్య |
41 | స్నేహం…. | శ్రీమతి శాంతి కృష్ణ |
42 | తరలిపోతున్నమేఘమాల… | శ్రీమతి శాంతి కృష్ణ |
43 | క్లిక్.. క్లిక్. క్లిక్… | పొన్నాడ సత్యప్రకాశ రావు |
44 | సిగ్గేస్తోంది | ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి |
45 | జయ గీత | విజయాదిత్య |
46 | మాతృ భాష – మాతృ భూమి | ఓట్ర ప్రకాష్ రావు |
47 | రావయ్యా రావయ్యా మరొక్కసారి | పాలేటి సుబ్బారావు |
48 | ఎక్కడెక్కడో వెతుకుతున్న!! | హరీష్ గౌడ్ |
49 | నేటి పల్లెటూరులు .. | గొర్రెపాటి శ్రీను |
50 | విశాఖ వైభవము | నండూరి సుందరీ నాగమణి |
51 | రాజకీయ క్షేత్రమున | మంగుదొడ్డి రవికుమార్ |
52 | కేరళ కన్నీటిని తుడుద్దాం రండి | మంగుదొడ్డి రవికుమార్ |
53 | తాజ్ మహల్ | దేవాంగం ప్రశాంతి |
54 | అభివృద్ధి అంటే | దేవాంగం ప్రశాంతి |
55 | క్షణికావేశం | కాండూరి వెంకట సన్యాసిరావ్ |
56 | ఒక ప్రశ్న కోసం | చొప్పదండి సుధాకర్ |
57 | క(ర)విత్రయం | కాండూరి వెంకట సన్యాసిరావ్ |
58 | బుద్ధాశ్రమం | బండారు ప్రసాదమూర్తి |
59 | రాజర్షి ఖేలుడు | వాగుమూడి లక్ష్మీ రాఘవ రావు |
కవితల నాణ్యత విషయంలో కూడా సంతృప్తి కలిగింది. రచనలల భావుకత, శబ్దాడంబరము, సామాజిక స్పృహ, సృజనాత్మకతలు ప్రోత్సాహకరంగానే వున్నాయి. ఇలాంటి రచనలకు ప్రోత్సాహమిస్తే, నినాదాలు, ఆర్తనాదాలు, శుష్కవాదనలు నిండిన కవితలతో అభాసుపాలయిన తెలుగు కవితకు మళ్ళీ చక్కని భావావేశంతో, భావనాబలంతో ఉత్తమస్థాయిలో సృజించే కవితలతో పాఠకాదరణ, గౌరవాలు లభిస్తాయనిపిస్తుంది. అలాంటి మంచిరోజు కోసం సంచిక తనవంతు బాధ్యత నిర్వహిస్తూ ఎదురుచూస్తోంది.
న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన ఉత్తమ కవితలు:
న్యాయ నిర్ణేతలు కవితలను ఎంచుకుంటూ తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలిపారు. వాటి ఆధారంగా ఎంపికయిన మొదటి మూడు కవితలు ఇవి.
- ప్రథమ బహుమతి — బుద్ధాశ్రమం- బండారు ప్రసాదమూర్తి (రూ. 5,000/-)
- ద్వితీయ బహుమతి- నాన్నగారి జేబు– వెన్నెల సత్యం (రూ.3000/-)
- తృతీయ బహుమతి- అమ్మభాష నాకు అమృతమయ్యె- భైరవభట్ల శివరాం (రూ.2000/-)
పాఠకుల వోట్ల ఆధారంగా ఎంపికయిన ఉత్తమ కవితలు:
- ప్రథమ బహుమతి 33% వోట్లతో– ఫోనొకటి చేతికొచ్చాక- చొక్కాపు లక్ష్ము నాయుడు (రూ. 5,000/-)
- ద్వితీయ బహుమతి- 21% వోట్లతో– ఎక్కడెక్కడో వెతుకుతున్నా – హరీష్ గౌడ్ (రూ.3000/-)
- తృతీయ బహుమతి- 9% వోట్లతో కర్చీఫ్- వెన్నెల సత్యం (రూ.1000/-)
9% అడుగుల సవ్వడి- శ్రీమతి శాంతికృష్ణ (రూ.1000/-)
సంచిక సంపాదకవర్గం ఎంచుకున్న ప్రోత్సాహక బహుమతులు:
- కవితా వనిత- సాయి మాధవ్ (రూ.1000/-)
- విశాఖ వైభవం- నండూరి సుందరీ నాగమణి (రూ.1000/-)
- క(ర)విత్రయం – కాండూరి వేంకట సన్యాసి రావు (రూ.1000/-)
- బంగారు భవిత – సింగిడి రామారావు (రూ.1000/-)
- ఈ క్షణవైరాగ్యం – విజయాదిత్య (రూ.1000/-)
అనుకున్న బహుమతులతో పాటూ అనుకోని బహుమతి రూ.1116/- ప్రత్యేక బహుమతి అతి గొప్ప ఖండ కావ్యాన్ని రచించి పోటీకి పంపినందుకు – ‘రాజర్షి ఖేలుడు’ – వాగుమూడి లక్ష్మీ రాఘవరావుకు…. కృతజ్ఞతలతో.
కవితల పోటీల్లో పాల్గొన్న వారికి, వోట్లేసి నచ్చిన కవితలను ఎన్నుకున్న పాఠకులకు, న్యాయనిర్ణేతలకు సంచిక ధన్యవాదాలు తెలుపుతోంది.
భవిష్యత్తులోనూ ఉన్నత ప్రామాణికాలను పాటిస్తూ ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని సంచిక వాగ్దానం చేస్తోంది.
గెలుపొందిన విజేతలు తమ బాంక్ అకౌంట్ వివరాలు అందచేస్తే వారి అకౌంట్లకు బహుమతి నగదును పంపుతాము.
సంచిక టీమ్