[box type=’note’ fontsize=’16’] “ఆవేశాన్ని అణచుకుని, ఆలోచనతో లోకం పోకడ నేర్చుకో” అంటున్నారు సి.హెచ్. గురుమూర్తి ఈ కవితలో. [/box]
[dropcap]ఆ[/dropcap]గవోయీ! పాంధుడా(బాటసారి)
వెనుక తెలియని అంధుడా
ఎచటి కోయీ తెరువరి
నీ పయనం మరీ మరీ!
ఏమిటి నీ ఆవేశం
మార్చుము నీ వేషం
నేర్చుకో లోకం పోకడ
ఓర్చుకో కష్టాల ములుకులు (బాధలు)
మార్చుకో ఆవేశపు స్వరూపం
దొడ్డది నీ ఉపశమనం
నిలుచునులే బృహత్తర ఉపాశనం
చింతించుము ఒక నిమిషం
అంతరించునులే ఆవేశం