సంచిక ‘2018 దీపావళి కథల పోటీ’ ఫలితాలు

4
3

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు. సంచిక నిర్వహించిన  దీపావళి కథల పోటీకి కథలు పంపిన రచయితలకు, వాటన్నింటినీ చదివి తమకు నచ్చిన కథలకు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని తెలిపిన పాఠకులకు, ఓటు వేయకున్నా కథలను చదివిన సంచిక పాఠకులకు, కథలన్నిటినీ ఓపికగా చదివి తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలిపిన న్యాయనిర్ణేతలకు సంచిక బృందం ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఇలా అందరం మనవంతు కర్తవ్యాన్ని నిజాయితీగా, నిర్మోహంగా, నిర్మొహమాటంగా నిర్వహిస్తూంటే త్వరలోనే తెలుగు కథల పోటీలలో కథల ఎంపికపై వున్న దురభిప్రాయం తొలగి ఆరోగ్యకరమయిన పోటీ వాతావరణం నెలకొంటుంది. నాణ్యమయిన రచనలు, రచయితలు సముచితమయిన గుర్తింపు పొందుతారు.

కథల పోటీకి అందిన కథలు, వాటి రచయితల వివరాలు ఇవి:

1 రెప్పలేని కన్ను గంధం నాగేశ్వర రావు
2 నా పిల్లలు ఎక్కడ? కిరణ్ కుమార్
3 రోజులు మారాయి కిరణ్ కుమార్
4 అంతులేని కథ తిరుమలశ్రీ
5 అప్పుడు .. అలా జరిగింది P.L.N. మంగారత్నం
6 ఆమె కథ ఎనుగంటి వేణుగోపాల్
7 పోలిక ముద్దుకృష్ణ
8 మలిజీవన ప్రస్థానం ముద్దుకృష్ణ
9 పెంపకం ముద్దుకృష్ణ
10 ఆమె ముద్దుకృష్ణ
11 నాన్న ముద్దుకృష్ణ
12 కారుమబ్బులు పేట యుగంధర్
13 స్థపతి వాగుమూడి లక్ష్మీ రాఘవ రావు
14 కృష్ణమ్మ కంఠశోష రిషిత
15 మాతృత్వము కుంతి
16 అమ్మ ప్రేమలో తేడా డా. లక్ష్మీ రాఘవ
17 మళ్ళీ వసంతం ద్విభాష్యం శ్రీదేవి
18 పరువుకోసం.. మధుకర్ వైద్యుల
19 పందెం డా. జడా సుబ్బారావు
20 అవును .. నిజం P.L.N. మంగారత్నం
21 స్వంత గూడు P.L.N. మంగారత్నం
22 వరమైన మొక్కు కె.ఎస్.ఎన్. రాజేశ్వరి
23 పనిమనిషి కృష్ణ స్వామి రాజు
24 కొడుకు రాజేష్ యాళ్ళ
25 బతుకు చెరువు పోడూరి కృష్ణకుమారి
26 మార్పు రావాలి ఓట్ర ప్రకాష్ రావు
27 పొడుస్తున్న పొద్దు నామని సుజనా దేవి
28 నడక విజయాదిత్య
29 పసి మొగ్గలు తోట సాంబశివరావు
30 మహా ప్రస్థానం ఎ. మోహన్ మురళి కుమార్
31 రోహిణి పినిశెట్టి శ్రీనివాసరావు
32 దడిగాడు వానసిరా పినిశెట్టి శ్రీనివాసరావు
33 బ్రతుకు తెరువు కె.వి. లక్ష్మణరావు
34 నాన్న మాట కె.వి. లక్ష్మణరావు
35 దీపావళి లక్ష్మి మెట్రమ్ శర్మ
36 మైనపు ముద్దలు రాయపురెడ్డి సత్యనారాయణ
37 నిత్య దీపావళి యలమర్తి అనురాధ
38 భూమిసుతుడి బావగార్లు ఎలక్ట్రాన్
39 ఆపన్నహస్తం కళాగీత
40 బిచ్చగత్తె దొండపాటి కృష్ణ
41 అశోక్ రిషిత
42 కోరిక ముమ్మిడి శ్యామలా రాణి
43 కలశంలో కామధేనువు రమ్యశ్రీ భువనం
44 కర్తవ్యం ప్రతిభ
45 పితృఋణం ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
46 మాతృవందనం పెమ్మరాజు అశ్విని
47 పెళ్ళంటే వ్యాపార బంధం కాదు హైమవతి పెబ్బిలి
48 బిందాస్ ఫ్యామిలీ “  — ఇక్కడంతా అదో  టైపు ! కోరుకొండ వెంకటేశ్వర రావు
49 జిజ్ఞాస మణి వడ్లమాని
50 గుడి మునిగిపోయింది కాండూరి వెంకట సన్యాసిరావు
51 రక్షణ దాసరి శివకుమారి
52 మన్నించండి ముమ్మిడి శ్యామలా రాణి
53 చుక్కమ్మ కళాగీత
54 అమ్మనే అలిగితే నామని సుజనా దేవి
55 స్నేహ లేఖ గీతూ రాయ్
56 విత్తు మీనాక్షి శ్రీనివాస్
57 స్నేయితం మీనాక్షి శ్రీనివాస్
58 అన్నదాత -సుఖీభవ సౌజన్య కిరణ్
59 అమ్మ బహుమతి సౌజన్య కిరణ్
60 అద్దాల భరిణ నండూరి సుందరీ నాగమణి
61 అమ్మ మాటలే నడిపే ఆయుధాలు సామల ఫణికుమార్
62 ఆశల తీరాలకు ఆవల గొర్రెపాటి శ్రీను

కవితల పోటీల పోలయిన ఓట్లతో పోలిస్తే, కథల పోటీలలో ఓటువేసిన వారి సంఖ్య గణనీయంగా పెరగడమే కాదు, అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. ఇలా కథలన్నిటినీ పాఠకుల ముందుంచటం వారికి నచ్చిన కథను ఎన్నుకోమనటం ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.  అయితే కొందరు కథకులు తమ కథలను వాట్సప్ లోనూ, ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసుకున్నారని, ఓటు వేయమని అడిగేరని, అలాంటప్పుడు పాఠకుల ఎంపిక సరైనది ఎలా అవుతుందని కొందరు ప్రశ్నించారు. వారి ప్రశ్న సరైనదే. వారి ఆక్రోశ, ఆవేదన సమంజసమైనదే…. కానీ, బొమ్మ బొరుసువుంటేనే నాణెం అవుతుంది. నిజానికి కథలను బహిరంగంగా పాఠకుల ముందుంచటం వారు నిష్పాక్షికంగా మంచి కథను ఎంచుకుంటారన్న నమ్మకంతో! అయితే, గతంలో పెద్ద పెద్ద పత్రికలు ఇలా పాఠకుల ఓటింగ్ నిర్వహించినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తాయి. ఇంతగా సాంకేతిక అభివృద్ధిలేని కాలంలో కూడా సమస్యలు వచ్చాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డు కోసం పత్రికలో కూపన్ ఇచ్చి ఓటు చేయమనేవారు. కొందరు కళాకారులు  పత్రిక మార్కెట్‌లో విడుదలకాకముందే తమ అభిమానులను అలర్ట్ చేసేవారు. పత్రిక విడుదల కాగానే వీరు పెద్ద ఎత్తున మార్కెట్‌లో వున్న పత్రికలన్నీ కొనేసి తమ అభిమాన కళాకారుడికి ఓటు వేసేవారు. ఇది దేశమంతటా జరిగేది.  అయితే, రచయితలు ఇలా తమ కథలకు ఓటు వేయాని ప్రచారం చేసుకోవటం, రచయితల పేర్లు చెప్పకుండా నంబర్లతో కథలను ప్రచురించే ప్రక్రియను అభాసుపాలు చేస్తుంది.  పాఠకుల అవార్డుతో పాటూ న్యాయనిర్ణేతల ఎంపిక కూడా వుండటంతో నాణ్యమయిన రచన గుర్తింపు పొందకుండా వుండదు. అయితే, ప్రస్తుతం రియాలిటీ షోలూ, ఓటింగ్ అభ్యర్ధనల కాలం కాబట్టి ఎవరినీ తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ, రచయితలు తమ రచనా బలం ఆధారంగానే బహుమతి లభించాలని ఆశించటం వాంఛనీయం. వారు తమ స్నేహితులకు, సన్నిహితులకు ఓటు వేయమని చెప్పాలి, కానీ, తమ కథ ఏమిటో చెప్పకుండా ఉత్తమ కథను ఎంపిక చేసుకోమని సూచించటం అభిలషణీయం. కథకులు ఇలా నిస్వార్ధంగా ఉత్తమ రచనను ఎంచుకోమని పాఠకులని కోరే రోజు త్వరలోనే వస్తుందన్నది సంచిక నమ్మకం. ఇది పాఠకులపై, రచయితలపై సంచికకున్న విశ్వాసాన్ని సూచిస్తుంది. అయితే, తమ కథకు ఓటు వేయమని ప్రచారం చేసుకున్న రచయితల కథలు పాఠకుల ఎంపికలో లేకపోవటం గమనార్హం. పాఠకుల విజ్ఞతని ఇది  సూచిస్తుంది.

ఇక పోటీ కథల పరిశీలన విషయానికి వస్తే, పాఠకులు అత్యంత ఉత్సాహంగా తమకు నచ్చిన కథలను ఎంచుకున్నారు.

₹ 5000/- మొదటి బహుమతి 55. స్నేహలేఖ —- 39.4%  – గీతూ రాయ్

₹ 3000/- రెండవ బహుమతి 6. ఆమె కథ——   19.8%  – ఎనుగంటి వేణుగోపాల్

₹ 2000/- మూడవ బహుమతి 9. పెంపకం——- 14.5% – ముద్దుకృష్ణ

విజేతలయిన రచయితలకూ, పాల్గొన్న రచయితలకూ, పాఠకులకు అభినందనలు.

న్యాయనిర్ణేతల ఎంపిక విషయానికి వస్తే, న్యాయనిర్ణేతలంతా ముక్తకంఠంతో పోటీకి అందిన కథల పట్ల తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తపరిచారు. వారి మాటల్లనే చెప్పాలంటే… “కథల్లో పోటీ స్థాయికి తగిన కథ ఒక్కటి కూడా కనిపించలేదు. అన్నీ పాత కథా వస్తువులే. పోనీ కథనం చూద్దామా అంటే అందులో కూడా వాసి లేదు. 62 కథల్లో ఒక్కటి కూడా మంచి కథ లేకపోవటం బాధ కలిగించే విషయం. ఉత్తమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు అర్హమయిన కథ ఒక్కటి కూడా లేదు. వెయ్యి రూపాయల బహుమతులు కూడా ఇవ్వక తప్పదనుకుంటే ఇవ్వొచ్చు….” అని కొన్ని కథలను సూచించారు.

అయితే, న్యాయనిర్ణేతలతో సంప్రదించి, వారితోనే  వెయ్యి రూపాయల బహుమతి కథలు అయిదు ఎంపిక చేయించాము. అలాగే, సంచిక బృందం అయిదు ప్రోత్సాహక బహుమతి కథలను ఎంచుకుంది. అంటే, మొత్తం 10 ప్రోత్సాహక బహుమతులన్నమాట…

న్యాయనిర్ణేతలు, సంచిక సంయుక్తంగా ఎంచుకున్న ప్రోత్సాహక బహుమతి కథలు. 

  • రక్షణ – దాసరి శివకుమారి
  • అప్పుడు అలా జరిగింది – P.L.N. మంగారత్నం
  • కొడుకు – రాజేష్ యాళ్ళ
  • బిచ్చగత్తె – దొండపాటి కృష్ణ
  • దడిగాడు వానసిరా – పినిశెట్టి శ్రీనివాసరావు
  • మన్నించండి – ముమ్మిడి శ్యామలా రాణి
  • గుడి మునిగిపోయింది – కాండూరి వెంకట సన్యాసిరావు
  • కృష్ణమ్మ కంఠశోష – రిషిత
  • బతుకు చెరువు – పోడూరి కృష్ణకుమారి
  • పితృఋణం – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి

విజేతలకు, పోటీలో పాల్గొన్న రచయితలకు, న్యాయనిర్ణేతలకు అభినందనలు, ధన్యవాదాలు. బహుమతులు పొందినవారు తమ బ్యాంక్ ఎకౌంట్ వివరాలను తెలియజేస్తే, బహుమతి నగదును వారి ఖాతాకి బదిలీ చేస్తాము.

పోటీలు అయిపోయాయి కాబట్టి, ఇప్పుడొక క్షణం నిలిచి కథల గురించి ఆలోచించాల్సి వుంటుంది. పోటీలకు పంపే కథలు సైతం ఆశించిన స్థాయిలో వుండకపోవటం గమనార్హం. పలు సందర్భాలలో పాఠకులు, రచయిత దృష్టిని ఈ విషయంపై మళ్ళించాలని సంచిక ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో పేరుపొందిన రచయితలంతా వయసు మళ్ళినవారే. కొత్త రచయితలు అడుగుపెడుతూనే ప్రశంశకులను మోసుకు వస్తున్నారు. ఒకటి రెండు కథలు రాయగానే తాము నేర్పటమే తప్ప నేర్చుకునేదేమీ లేదన్న నమ్మకంతో  ప్రవర్తిస్తున్నారు. వారి చుట్టూ చేరిన వందిమాగధ భట్రాజ భజనబృందాలు, వారికి మూర్ఖ రాజావస్త్రాలు వేసి వారిని ఆ భ్రమలోనే వుంచుతున్నారు. దాంతో, ఒక తరం నుంచి, మరో తరం అందుకుని రిలే పరుగుపందెంలా ముందుకు సాగాల్సిన సాహిత్య ప్రయాణం ఒక తరం తరువాత అందుకునేవారు లేని పరిస్థితి. వున్నా, మేమెందుకు అందుకుని ముందుకు సాగాలనే వారే అధికంగా వుండటం ముంచుకొస్తున్న ముప్పును స్పష్టం చేస్తున్నది. సత్వరం సరయిన చర్యలు చేపట్టి, యువ రచయితలను తీర్చిదిద్దటంపై దృష్టి పెట్టకపోతే, నూతన పాఠకులను ఆకర్షించటం పట్ల ఆసక్తి చూపకపోతే – భవిష్యత్తు తరాల ముందు మనం దోషిగా నిలబడాల్సి వస్తుంది.

పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించిన సంచిక త్వరలో రచయితల సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశంలో కథకు సంబంధించిన పలు విషయాలను కథకులు కలసి చర్చించటంతో పాటూ, యువ కథకులు, ప్రసిద్ధి చెందిన కథకులతో కలసి విషయాలను గ్రహించే వీలుంటుంది. వివరాలు త్వరలో ప్రకటిస్తాము. ఈ సమావేశంలో పాల్గొనాలన్న ఉత్సాహం కలవారు ప్రకటన కోసం ఎదురుచూడకుండా తమ సంసిద్ధతను వ్యక్తపరిస్తే, వారిని వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలు తెలుపుతాము. తెలుగు సాహిత్యాన్ని చిరకాలం సజీవంగా వుంచేందుకు మనమందరం కలసి చేయాల్సిన యజ్ఞం ఇది. ఒక తరం మరో తరానికి తన వారసత్వాన్ని అందించి బాధ్యతను, కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ తన వంతు బాధ్యతను నిర్వహించే ఈ యజ్ఞంలో మనమందరమూ అన్ని విభేదాలను మరచి కలసికట్టుగా సాగాల్సివుంటుంది.  మనుషులంతా ఒకటిగా కలిస్తే తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోగలరన్న సాహిర్ లూధియాన్వీ  మాటలను స్మరిస్తూ చేతులు కలిపి భవిష్యత్తు తరాలకోసం కలసి సాగుదాం.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here