[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా బాతుల గురించి, అవి చేసే మేలు గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]వా[/dropcap]రాంతపు సెలవు రోజు ఉదయం టిఫిన్ బ్రెడ్ ఆమ్లెట్ తింటూ మానస్, అదితి టీవీలో డోనాల్డ్ డక్ కార్టూన్ చూస్తున్నారు. మధ్యమధ్యలో డోనాల్డ్ డక్ అల్లరికి పడీపడీ నవ్వుకుంటున్నారు. ఇంతలో డోర్ బెల్ వినిపించింది. వంటింట్లో ఉన్న నానమ్మ ఎవరొచ్చారో చూడమని సుమకి చెప్పింది.
డోర్ తెరిచి చుసిన సుమ, అక్కడే టీవీ చూస్తున్న పిల్లలు ఆనందపడిపోయారు వచ్చిన వ్యక్తిని చూసి. వచ్చింది ఎవరోకాదు అదితి అత్త, ప్రియ ఫామిలీ.
పిల్లలు పరుగెత్తి కెళ్ళి “అత్తయ్య! మామా! హాయ్! ప్రకృతి”! అని పలకరించారు. పిల్లలు ముగ్గురు టీవీలో కార్టూన్ చూడటానికి వెళ్లిపోయారు. మిగతావారందరు పలకరింపులు అయ్యాక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇంతలో ప్రియా అత్త “ప్రకృతీ! అదితి తమ్ముడు తేజుకి గిఫ్ట్ ఇవ్వు” అని పిలిచింది.
“వావ్! గిఫ్ట్!” అంటూ అమ్మ ఇచ్చిన పెద్ద బాతు బొమ్మల బండిని చాప మీద కూర్చుని ఆడుకుంటున్న చిన్ని తేజుకి ఇచ్చింది.
“తేజు! సి! డక్స్! ఆడుకో!” అని అంటూ వాడి బుగ్గ మీద ముద్దుపెట్టుకుంది. తేజు ప్రకృతి జుట్టును పట్టిలాగి నవ్వాడు.
“చూడు నానమ్మా! తేజు జుట్టు పీకుతున్నాడు. “
“ఇట్స్ ఓకే ప్రకృతీ. చిన్నవాడు” అంది ప్రియ
ఇంతలో మానస్, అదితి తేజుకి ఇచ్చిన బాతులా బండితో ఆడటం మొదలుపెట్టారు. అటు ఇటు లాగుతూ పరిగెత్తుతున్నారు. పాపం! తేజుకి ఆ బొమ్మ కావాలని అటు ఇటు పాకుతూ అందక ఏడుపు మొదలు పెట్టాడు ‘వూ’ అంటూ. ప్రియా అత్త వాళ్ళ దగ్గరనుండి బొమ్మ తీసుకుని తేజుకి ఇచ్చి ఆడించింది.
బుంగ మూతి పెట్టుకుని ఉన్న పిల్లలు ముగ్గుర్ని దగ్గరకు పిలిచి కోపం పోగొట్టింది. “అదితి, మానస్, ప్రకృతి మీకు డక్ బొమ్మ ఎందుకు? నేను మీకు నిజం డక్స్ అంటే బాతుల గురించిన కబుర్లు చెబుతాను. వినటానికి
రెడీనా?” అంది.
“ఓ! రెడీ!” అని గట్టిగా చెప్పి ప్రియా ఎదురుగా వినటానికి కూర్చున్నారు.
“అదితీ, నువ్వెప్పుడైనా నిజం డక్‌ని చూశావా?”
“చూశాను ప్రియత్తా. మేము స్కూల్ పిక్నిక్‌కి జూ కి వెళ్ళినప్పుడు.”
“గ్రేట్! మరి మానస్?”
“నేనూ జూ లో చూశాను. నాకు డోనాల్డ్ డక్ కార్టూన్ ఇష్టం. ఇట్స్ ఫన్నీ” అన్నాడు మానస్. ప్రకృతి తాను డక్‌ని ఢిల్లీ లో జీల్ పార్క్ లో చూశానని అంది.
“మరి మీకు డక్ బొమ్మలు ఉన్నాయా?”
“ఉన్నాయి” అన్నారు.
“సరే డక్ కహానీ వినండి” అంది ప్రియ.
“అత్తా! డక్ కబుర్లన్నావు?” అంది అదితి.
“కహానీ, కబుర్లు ఒకటే. విను” అన్నాడు మానస్.
ప్రియా డక్ కహానీ చెప్పటం మొదలు పెట్టింది.
“డక్ Anatidae ఫామిలీకి చెందిన పక్షులు అదే బర్డ్స్‌లో ఒక రకం. అంతే కాదు అవి స్వాన్, గీస్‌కి చుట్టాలు. డక్ చాలావరకు మంచి నీరు, సముద్రపు నీరులో ఉండే జలచరం. అంటే నీటిలో ఉండే బర్డ్. అక్వాటిక్.”
“ప్రియత్తా! మరి నేను జూ లో నెల మీద తిరుగుతుంటే చూసాను” అంది అదితి.
“అవునా? విను చెబుతా. డక్స్/బాతులు ఒక్క అంటార్కిటికా తప్ప మిగతా అన్ని దేశాలలో ఉంటాయి. మానస్ మగ బాతుని ఏమంటారు?”
“బాతు. డక్.”
“అవునా?” అని గట్టిగా నవ్విన ప్రియ “దగ్గర రా! ఐ విల్ టెల్ యూ. మేల్ డక్‍ని డ్రేక్ అని, ఫీమేల్ అంటే లేడీ డక్‌ని హెన్ అని అంటారు. మరి బేబీ డక్‌ని ఏమంటారు?”
“డక్లింగ్ అంటారు” అన్నారు అదితి, మానస్.
“గ్రేట్! డక్స్/బాతులు ఓమ్నిఒరస్. అవి నీటిలో ఉండే నాచు, ఆకులు, పురుగులు, చిన్ని చేపలు, కీటకాలు/ఇన్సెక్ట్స్‌ని తింటాయి. ఇంటిలో పెంచుకునే బాతులకి గింజలు, బ్రెడ్ పెడతారు.”
“అదితీ, నాన్నను అడిగి మనం డక్స్ ఇన్ని టెన్ పెంచుకుందాము” అన్నాడు మానస్.
“అమ్మ ఒప్పుకోదు. చదువుకోమంటుంది” అంది అదితి.
“ఓకే అత్తా, కంటిన్యూ” అన్నాడు మానస్
“వినండి. డక్స్/బాతుల్లో సి డక్, డైవింగ్ డక్ అనేవి వాటి పేరుకి తగ్గట్టే నీటి లోపలికి వెళ్లి ఫుడ్ వెతికి తింటాయి. చాలాసేపు నీటి లోపల ఉండగలవు. డబ్లింగ్ డక్ నీటిలో, నేల మీద ఉండగలవు. వీటి ముక్కు చివర దువ్వెనలా ఉండి వాటి తలను నీటి లోపల ఫుడ్ కోసం పెట్టినప్పుడు ఫుడ్‌తో పటు వచ్చే ఇతర ఫుడ్స్‌ని వడకట్టి ఫిల్టర్ చేసి వాటికి నచ్చిన ఫుడ్ దొరికేలా చేస్తాయి.”
“వావ్! డక్స్, బాతులు చాల స్నేహంగా, క్యూరియస్‌గా ఉండే మల్లార్డ్ డక్స్‌ని దాదాపు 500 యియర్స్ నుండి పెంపుడు పక్షిలా పెంచుకుంటున్నాము. మెగా మల్లార్డ్ బాతుకి మెరిసే గ్రీన్ తల, గ్రే రెక్కలు/వింగ్స్, పెద్ద పొట్ట
ఉంటుంది. ఫిమేల్ డక్‍కి బ్రౌన్ రంగు ఉంటుంది. ఈ బాతులు వాటి సొంత ప్రపంచంలో ఉంటే 2- 20 యియర్స్ బ్రతుకుతాయి.”
“మరి మన వరల్డ్‌లో అదే ప్రియత్తా… మనం పెంచుకున్నవి ఎన్నాళ్ళుంటాయి?” అని అడిగాడు మానస్.
“ఆఁ మే బి ఎయిట్ యియర్స్!” అన్నది ప్రియ.
అన్ని బాతులకి వాక్స్ పూసినట్లు ఉండే రెక్కలు ఉంటాయి. దానివల్ల బాతులు నీటిలో మునిగినా, తిరిగినా తడవ్వు. వాటర్ ప్రూఫ్ బాడీ. డక్స్ పెంచితే మనకి చాలా ఉపయోగాలున్నాయి. మనకి ఫుడ్ కోసం, మాంసం, ఎగ్స్
కోసం, అంతే కాదు వాటి ఈకలు్… ఫెథెర్స్‌ని కోట్స్, ఫాన్సీ థింగ్స్ చెయ్యటానికి యూజ్ చేస్తారుట. డక్స్ పిల్లలకి అంటే మీకు చాలా ఇష్టమైన కార్టూన్. డొనాల్ డక్ – డిస్నీ డఫి డక్ – వార్నర్ బ్రదర్స్…”
“మేము చూశాము. చూశాము” అన్నారు పిల్లలు.
“వినండి. ఫిమేల్ డక్ అదే… అమ్మ డక్… ఎగ్స్ పెట్టటానికి ఒక మంచి చోటు వెతుక్కుని గడ్డి లేదా ఎండు గడ్డి, పుల్లలు ఏరి నెస్ట్/గూడు కట్టి మగ బాతు కాపలా కాస్తుంటే 5-10 గుడ్లు పెట్టి వాటి మీద కూర్చుని పొదుగు తుంది. అంటే పిల్ల బాతులు చేస్తుంది. అందుకు 28-35 డేస్ టైం పడుతుంది. తరవాత 8- 12 వారాలు/వీక్స్ పెద్దవి అయ్యాక నెస్ట్ వదిలి ఎగిరిపోతాయి. అప్పటి దాక వాటికీ మమ్మీ డక్ ఫుడ్ ఇస్తుంది. డక్స్ ఉండే నీరు క్లీన్‌గా ఉంటుంది. పురుగుల్ని తినేస్తాయిగా. అందుకు. డక్ నిద్రపోతున్నప్పుడు ఒక కన్ను తెరిచి ఉంచి సగం బ్రెయిన్ నిద్రపోతుందిట.”
“ఫన్నీ!” అంది అదితి.
డక్‌కి పాము, బిగ్ ఫిష్, తాబేలు/టర్టిల్, రాకూన్, హక్స్ పెద్ద శత్రువులు. డక్ శత్రువుని సెకండ్స్‌లో పసికట్టేస్తాయి. డక్‌కి మంచి కంటి చూపు ఉంది. బాగా చూడగలవు. రంగుల్ని కూడా చూడగలవు. పాపం! బాతులు! మనుషులు చేస్తున్న పనులవల్ల బాదపడుతున్నాయి.”
“వాట్! హౌ?” అన్నాడు మానస్.
ఎలా అంటే, మనం నదుల్లో, సముద్రంలో, లేక్స్‌లో ఉన్న నీటిని పొల్యూట్ చేస్తున్నాం, రసాయనాలు వేసి పాడుచేస్తున్నాము. అందువల్ల వాటర్‌లో ఉండే లైఫ్… ఫిష్, మొక్కలు, ఇన్సెక్ట్స్ చనిపోతున్నాయి. వాటర్ రంగు మారి లోపల ఉన్న ఫుడ్ సరిగా కనిపించక వెతకటం ఎక్కువైనది. సో పాపం వాటికీ ఫుడ్ సరిగ్గా దొరక్క ఎక్కువ ఎగ్స్, బేబీస్ పెట్టలేకపోతున్నాయిట. వాటర్ కూడా తగ్గిపోతోంది – మనం లేక్స్‌ని ఫిల్ చేసి పెద్ద బిల్డింగ్స్ కట్టటంతో. సో. డక్స్ మమ్మల్ని బ్రతకనివ్వండి, వాటర్ పొల్యూట్ చెయ్యకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాయి. మీకు తెలుసా? గణేష్, దుర్గ నిమజ్జనం కూడా మంచిది కాదు వాటర్‌కి, డక్స్‌కి. పిల్లలూ.. మీరు ఎప్పుడు వాటర్ బాడీస్‌లో చెత్త వెయ్యద్దు” చెప్పింది ప్రియ
“అలాగే ప్రియత్తా” అన్నారు పిల్లలు.
“ప్రియా! పిల్లలూ, భోజనానికి రండి!” అని నానమ్మ పిలిచింది.