[box type=’note’ fontsize=’16’] వాస్తవం కాని స్వప్నాన్ని చేతికందని పక్షితో పోలుస్తున్నారు యువకవి సి.వి.ఎస్. సందీప్ ‘ఏ వాడనో తిరిగి ఓ కల’ అనే ఈ కవితలో. [/box]
[dropcap]ఏ[/dropcap] వాడనో తిరిగి ఓ కల
నిదుర చెట్టు మీద వాలింది
నీవు లేక నేను లేనన్నది కల
కలవంటూ కలవవెందుకన్నది నిదుర
ఒక్క క్షణం కనిపించి, కవ్విస్తూనే
మరు క్షణం మాయమయే మెరుపే నువ్వా
నింగంచున మెరిసే
చిరు చినుకుల తడిలా
ఏం మాయ చేశావో
నిజమైన కలలా
నీ పాటే పాడుతూ
నీ కోసం వెతుకుతూ
నాలో నను నేనే కనుగొంటున్నా
ఆ క్షణం పాటి మెరుపు నిలిచేనా కడదాకా
కళ్ళు తెరవనంత మాత్రాన …కల నిజమైపోదుగా
చేతికి అందకున్నా, ఊహల్లో తిరుగుతున్నా
నీ కలల వెలుగులోనే
నేనడుగులు వేస్తూఉన్నా …
ఈ నా అసలు కల మారదు
ఏ వాడ చిలుకవో జాడైనా తెలియదు
నీకు నిదుర కావాలి
నేను ఎదురు చూడాలి.