[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా ఉడుతల గురించి, వాటిలోని రకాల గురించి, మనుషులకు అవి చేసే మేలు గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]ధ్రు[/dropcap]వ్, ఆర్యా తాతా బామ్మాతో కలిసి జంగల్ రిసార్ట్‌కి వెళ్లారు. సిటీ లైఫ్ లోని ఉరుకులు పరుగులకు దూరంగా పెద్ద చెరువుకి దగ్గర్లో చిన్ని కొండమీద మోస్తరు అడవిలోని వృక్షాల నీడలో ఏర్పాటుచేసిన టెంట్స్‌లో బస. ఫేమస్ ఫైవ్ స్టోరీలో లా వుడ్స్, టెంట్స్, బర్డ్స్, వాటర్.
‘వో!’ అని ఉత్సాహంగా అరిచారిద్దరు.
“డు యు లైక్ ఇట్?” అన్నాడు మామ విశాల్.
“మామా సూపర్! థాంక్స్!” అన్నారిద్దరు కోరస్‌గా. నవ్వి దగ్గరకు తీసుకున్నారు మామ విశాల్, అత్తా వినీత.
“ఓకే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫారెస్ట్ తిరిగివద్దాం” అని అందరు టెంట్స్ బైట వేసిన చైర్స్‌లో నీడలో కూర్చున్నారు. పెద్దవాళ్ళు టీ తాగుతున్నారు, పిల్లలు స్నాక్స్ తింటూ పరిసరాలు పరికిస్తున్నారు.
ఇంతలో ఎదురుగా ఉన్న చెట్ల మీదనుండి ఉడతలు క్రిందకు వచ్చి పిల్లలు విసిరిన బ్రెడ్ ముక్కలు తీసుకుని పరుగెత్తాయి. ఒక ఉడత మాత్రం ధైర్యంగా బ్రెడ్ ముక్కని రెండు చేతులతో పట్టుకుని చెట్టు దగ్గర తింటున్నది.
అది చూసిన ధ్రువ్, “ఆర్యా! స్క్విరెల్! లుక్ దేర్!” అని పరుగెత్తాడు. వాడి వెనకే ఆర్య. వీళ్ళను చూసి ఉడత చెట్టు మీదకు పరుగెత్తింది.
“హే! హే! కం డౌన్! ప్లీజ్!” అని బ్రతిమిలాడుతున్న వాళ్ళని ఎక్కిరిస్తున్నట్లుగా చేతిలో ఉన్న బ్రెడ్ ముక్కని క్రిందకు వదిలి ఇంకా పైకి వెళ్లి ఉడతలు గుంపులో చేరింది. తమకేసి చూస్తున్న ఉడతల్ని అలాగే చూస్తూ నుంచున్నారు. క్రిందకు వస్తే పట్టుకోవాలని ప్రయత్నం. కానీ అవి కొద్దిసేపటి తరువాత చెట్టు మీదనుండి వేరే చెట్ల మీదకు దూకుతూ వెళ్ళిపోవటంతో నిరాశగా వెనక్కి వచ్చారు.
అది చూసిన మామ విశాల్ “ఓకే కిడ్స్! అడవి చూడటానికి వెళ్దామా?” అని అడిగాడు.
“మామా! వుయ్ వాంట్ ఉడుతలు. పెంచుకుంటాము.”
“అవి మనకి దొరకవు.”
“నో . వుయ్ వాంట్ దెమ్.”
“దొరకవని చెప్పానుగా. మీరు ట్రై చేసారు. అవి పారిపోయాయిగా” అన్నాడు విశాల్
“మాకు కావాలి. అంతే” అని ధ్రువ్ మంకుపట్టు పట్టి విసిగించాడు. ఇదంతా చూస్తున్న గ్రాండ్‌మా – ట్రిప్‌లో ఉండాల్సిన ఫన్ పోతుందన్న సంగతి తెలిసి “ధ్రువ్, ఆర్యా, రండి ఇక్కడకు. ఉడతలు కావాలంటే రావాలి” అన్నారు. పరుగున వచ్చిన ధ్రువ్, ఆర్యలని దగ్గరకు తీసుకున్నారు.
“ముందుగా మీరు ఆ ఉడతలు గురించిన విషయాలు తెలుసుకోవాలి” అన్నారు పిల్లలకు అర్ధం అయిపొయింది – గ్రాండ్‌మా స్క్విరెల్ స్టోరీ చెప్పబోతున్నారని. ఏ వయస్సు వారికైనా కథలంటే మక్కువే కదా?
“ఆర్యా, ధ్రువ్ మీరు మీ ఊళ్ళో ఉడతల్ని చూసారా?”
“ఆ! ఒకటి రెండు సార్లు జీల్ పార్క్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే” అన్నాడు పదేళ్ల ధ్రువ్.
“అవునా! ఉడతలు ప్రపంచం అంత దాదాపుగా కనిపిస్తాయి. ఒక్క ఆస్ట్రేలియా, అంటార్కిటికా తప్పించి. పిల్లలు, పెద్దలు అందరికి నచ్చే ప్రాణి. మనకి కనిపించే అడవి ప్రాణుల్లో అదొకటి. నగరాల్లో కూడా ఉంటాయి. ఆర్యా మీకు తెలుసా? ఈ ఉడతలు అడవికి దూతలు.”
“అంటే?”
“అంబాసిడర్లు. ఇవి పెద్ద చెట్లు ఉండే పార్క్స్, పండ్ల తోటల్లో ఉంటాయి. మీకు తెలుసా? నార్త్ కెరొలినా…”
“అమెరికాలో ఉందిగా, అదేనా?”
“యు అర్ కరెక్ట్. అదే. వైల్డ్ లైఫ్ రిహాబిలిటేటర్/పునరావాస కర్త – క్రిస్టీ మాకెఔన్ 2001లో జాన్ 21 న ‘ఉడతల అభినందన రోజు’ అని స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం జరుపుతున్నారుట.”
“ఉడతలకు పండగా? వింతగా ఉందే” అన్నాడు ధ్రువ్.
“వింత కాదు. మన కర్తవ్యం. మనం ఇంత సెల్ఫిష్ అవక ముందు మనకు హెల్ప్ చేస్తున్న ప్రాణులన్నింటినీ ఇష్టపడి, దేవుళ్ళలా పూజించేవాళ్ళము. ఎవరైనా మనకి చాలా హెల్ప్ చేస్తే ఏం అంటాము?”
“ఫ్రెండ్, గాడ్ సెంట్ , గాడ్ లా…”
“అవును. అందుకే వినాయక చవితి పండుగ అనిమల్ ప్లస్ వైల్డ్ ప్లాంట్స్; నాగుల చవితి పాములు, హనుమ మంకీ గాడ్, సరే అసలు సంగతిలోకి వద్దాము. ఉడతల అభినందన రోజున మనందరికీ ఇష్టమైన ఉడతలు వాటికీ నచ్చే ఫుడ్ పెట్టి థాంక్స్ చెప్పాలి. మరి ఎక్కువ ఫుడ్ ఇవ్వకూడదు. ఇస్తే వాటికీ మనలా పొట్టనొప్పి వస్తుంది. ఉడతలు ప్రపంచం మొత్తంలో 280 రకాలకు పైగా ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు ఎక్కేవి, గాల్లో ఎగిరేవి. వాటి ఇంటిపేరు తెలుసా?”
“ఇంటి పేరా? యూ మీన్ సర్‌నేమ్?” అన్నాడు ఆర్య.
“అవును.”
“తెలీదు.”
“అవన్నీ chipmunks అనే ఫ్యామిలీ కి చెందిన రోడంట్స్. ట్రీ, గ్రౌండ్, ఫ్లైయింగ్ అనేవి కొన్ని పేర్లు. ఒకసారి 2-5 పిల్లల్ని పెడుతుంది ఉడత. ఉడతలు సైజ్ 5 అంగుళాల నుండి 3 అడుగుల వరకు ఉంటాయి. ఇండియా, చైనాలలో జైంట్ ఉడతలుంటాయి. చాలామటుకు చిన్న ఉడతలు పెద్ద కుచ్చు తోక వీపు మీద చారలతో ఉంటాయి.
“సో బిగ్!”
“ఇంకో వింత తెలుసా? వాటి ఫ్రంట్ టీత్ ఎప్పటికి పెరుగుతూనే ఉంటాయట.”
“నిజంగా?”
“అవును. ఇవి కరెంటు తీగల మీద తిరుగుతూ వాటి ముందు పళ్ళతో వాటిని కోరకటంతో అమెరికా లాంటి దేశాల్లో వందల సార్లు పవర్ సప్లై ఆగిపోయిందిట. అంత బలంగా ఉంటాయి వాటి పళ్ళు. సాధారణంగా పెద్ద ఉడతలు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి. చలి దేశాల్లో మాత్రం చలికాలంలో గుంపులుగా ఉంటాయి. ఉడతలు గుంపుని scurry లేదా dray అంటారు.”
scurry scurry అని మననం చేసుకున్నాడు ఆర్య. dray dray అన్నాడు ధ్రువ్.
“ట్రీ స్క్విరెల్ గింజలు, పండ్లతో పాటుగా ఇన్సెక్ట్స్.. పురుగులు, కీటకాలు, నత్తలు, ఎగ్స్, మాంసం కూడా తింటాయి. వాటికి వారానికి ఒక కిలో ఫుడ్ కావాలి. ఇక, ఫ్లైయింగ్ ఉడతలు నిజంగా ఎగరవు.”
“మరి ఆలా ఎందుకు పిలుస్తారు?” అన్నాడు ఆర్య.
“ఎందుకంటే వాటి లెగ్స్ మధ్య ఉండే స్కిన్/చర్మాన్ని సాగతీసి చెట్ల మీదనుండి glide అవుతాయి – గాలిపటం లాగా. ఉడతలు పగలంతా చాల చురుగ్గా ఉంటాయి మీ లాగా.”
“గ్రాండ్‌మా! చలికాలం, నైట్‌లో వాటి రెస్టింగ్ ప్లేస్?”
“చెట్టు తొర్రలో అంటే బిగ్ ట్రీస్‌లో బిగ్ హోల్ ఉంటే వాటిలో. లేదంటే చెట్టు మీద ఉంటాయి. ఉడతలు చక్కగా కమ్యూనికేట్ చేయగలవు అరుపుల ద్వారా. తోక, కాళ్ళ కదలికలతో కూడా మాడ్లాడుతాయి. బాడీ లాంగ్వేజ్. దొరికిన
ఫుడ్‌లో కొంత దాచుకుంటాయి వానాకాలం, చలికాలం కోసం. ఉడత తోకని పారాచూట్‌లా వాడుతుంది 100 అడుగుల ఎత్తునుండి దూకినా దెబ్బతగలకుండా. ఉడతలు నేలలో, ఐస్‌లో పెట్టిన పుడ్‌ని గుర్తుపట్టి తినగలవు. ఐస్ ఏజ్ సినిమాలోలా. పాపం ఉడతలు అవి దాచిపెట్టిన ఫుడ్‌ని ఎక్కడ పెట్టాయో కొన్నిసార్లు మరచిపోతాయిట. చాలావరకు ఫుడ్ సీడ్స్‌ని నేలలో గుంత తవ్వి దాస్తాయి. అవి మరచిపోవటంతో గింజలు మొలిచి చెట్లు అవుతాయి. ఆలా ఉడతలు వేలు, లక్షల సంఖ్యలో గింజలను దాచి మరచిపోవటంతో మనకు భూమి మీద అడవులు తయారవుతాయి. మనం అడవులు నరికివేస్తే ఉడతలు గింజలు నాటి మీకోసం ఫారెస్ట్ తయారుచేస్తున్నాయి. ఉడతకి ఉన్న catching అలవాటువల్ల రకరకాల చెట్ల విత్తనాలను పట్టి నేలలో దాచి మొక్కలు పెరగటం ద్వారా అడవికి, పర్యావరణానికి, మనకి చాలా హెల్ప్ చేస్తున్నది. అడవులు ఆక్సిజన్‌ని ఇస్తాయి. ఎండని, వేడిని తగ్గిస్తాయి.”
“అవును. గ్రాండ్‌మా! మనం ఇంట్లో ఎసి లేకుండా ఉండలేము. బట్ ఇక్కడ కనీసం ఫ్యాన్ కూడా లేకుండా కూల్‌గా ఉంది” అన్నాడు ధ్రువ్.
“ట్రీస్ ఉన్నాయిగా అన్నా!” అన్నాడు ఆర్య.
“యూ గాట్ మై పాయింట్. మీకు నేను చెప్పిన రామాయణంలో రాముడికి హెల్ప్ చేసిన ఉడత స్టోరీ గుర్తుందా?”
“ఉంది.”
“మన దేశంలో ఉడతకి హాని చేయకూడదంటారు. చెయ్యరు. ఎందుకు?”
“ఉడత, రాముడు ఫ్రెండ్స్” అన్నాడు చటుక్కున ధ్రువ్.
“గుడ్. అవును.”
“అందుకే ఉడతకు ఫీడ్ చెయ్యాలి తప్ప పట్టుకోము. నేటివ్ అమెరికన్ నమ్మకాలూ కధల్లో నల్లని ఉడతలు సూర్యుని sun ని తినటానికి ట్రై చెయ్యటం వల్ల సూర్య గ్రహణం/సోలార్ ఎక్లిప్స్ వస్తుందని అనుకునేవారుట. అంతేకాదు ఎక్లిప్స్ మొదలు కాగానే పెద్దగా అరుపులు శబ్దాలు చేసేవారట. గ్రహణం అవగానే ఉడతను వెళ్లగొట్టామని హ్యాపీగా ఫీల్ అయి డాన్స్ చేసేవారట. ఉడతలు మనలాగే మారుతున్నా పరిసరాలకు అనుగుణం అవి మారుతాయిట. అవి చాలా తెలివైనవి కూడా. పజిల్స్‌కి సమాధానం రెండేళ్ళ వరకూ గుర్తుపెట్టుకుంటాయిట. మనం మన చుట్టూ ఉన్న అన్ని ప్రాణులు, చెట్లు, నీరు, గాలి నుండి ఎన్నో లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అందరికి ఈ ఎర్త్ మీద ఆనందంగా బ్రతికే హక్కు ఉంది. పర్యావరణానికి, ప్రాణులకూ పెద్ద శత్రువు మనిషే. ధ్రువ్, ఆర్యా! ఉడతని పట్టుకుని వాటి ఇంటినుండి వెళ్లగొట్టి వాటికీ, ఎర్త్‌కి ఎనిమీలు అవుతారా? లేక ఉడతలకి అవసరమైన అడవులు, వాతావరణం, పరిసరాలు పాడుచెయ్యకుండా కాపాడే పర్యావరణ స్నేహితులు అవుతారా? ఫ్రెండ్ లేదా ఎనిమీ. ఎవరు మీరు?”
“గ్రాండ్‌మా! మేము అడవికి ఫ్రెండ్స్. ప్రామిస్” అని గ్రాండ్‌మా చేతిలో చెయ్యి వేశారు.
“గ్రాండ్‌మా, మేము మా ఊరు వెళ్ళాక మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎకో ఫ్రెండ్లీ క్లబ్ స్టార్ట్ చేసి అందరిని ఎర్త్‌కి స్నేహితులుగా మారుస్తాము. మామా! మామా! అడవి చూడటానికి వెళ్దాము పద.”
పర్యావరణ బ్రిగేడ్ బయలుదేరింది అడవిలోకి.