[dropcap]‘నా[/dropcap]కు నచ్చిన నా కథ’ శీర్షికతో 100 మంది రచయితలతో ఓ కథా సంకలనం తేవాలని సంకల్పించాము. ఈ ప్రయత్నం తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉండాలని కోరిక.
ఆసక్తిగల రచయితలు నుండి మేలైన కథలను ఆహ్వానిస్తున్నాం. సహకార పద్ధతిలో ప్రచురించదలచిన ఈ సంకలనం కోసం పంపే కథలు నాలుగు పేజీల లోపు ఉండాలి, ఒక్కో రచయిత రెండు కథలు పంపినట్లయితే ఒకటి ఎన్నుకోవటానికి వీలుంటుంది.
DTP చేసి ఓపెన్ ఫైల్ లో పంపాలి, లేదా మంచి దస్తూరితో రాసి కూడా పంపవచ్చు. కథ తమ స్వంతమేనని హామీ పత్రం తప్పనిసరి. ఇదివరలో ఏదైనా పత్రికలో ప్రచురించినట్లయితే సంచిక తేదీ పేరు కూడా ఇవ్వండి.
మీ కథలను 2018 డిసెంబరు ఒకటో తేదీలోగా ఈ క్రింది చిరునామాకు పంపాలి. ఫిబ్రవరి 2019లో పుస్తక ప్రచురణ పూర్తయి ఆవిష్కరణ జరుగుతుంది.
కథ ప్రచురించిన రచయితకు 10 కాపీలు ఇవ్వబడతాయి. పుస్తకాలను రచయితలు వారి స్వంత ఖర్చులతో తీసుకోవాలి లేదా రవాణా చార్జీలు, కొరియర్ ఛార్జీలు భరించే వారికి నేరుగా ఇంటికి పంపబడతాయి.
గడువు తేదీకి చేరిన కథలతో సంకలనం ప్రచురింపబడుతుంది. ఆవిష్కరణ తేదీ మరియు వేదిక ఫిబ్రవరి మొదటి వారంలో తెలియజేయబడుతుంది. ఇతర వివరాలకు సంప్రదించండి 8977732619. nkbabu_nk@yahoo.com
కథలు పంపాల్సిన చిరునామా:
N. K. Babu,
Shop No. 1,
N G O home,
Taluk office road,
Vizianagaram 535002.