కురుక్షేత్ర సంగ్రామంలో ఐదు తరాలు

1
4

[box type=’note’ fontsize=’16’] కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న కురువంశంలోని ఐదు తరాల గురించి బాలల కోసం సరళంగా వివరిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు. [/box]

[dropcap]మ[/dropcap]హాభారతం పంచమవేదంగా ప్రాశిస్తిపోందింది. సుమారు 1655 పాత్రలు మనకు కనిపిస్తాయి. సంస్కృత మూలం(వ్యాసవిరిచితం)లో లక్షకు పైగా శ్లోకాలు ఉన్నాయి. కవిత్రయంవారి ఆంధ్ర మహాభారతంలో సుమారు 21,5000 పద్య గద్యలు ఉన్నాయి. ఆంధ్రమహాభారతం ప్రకారం శతశృంగపర్వతం నుండి హస్తినాపురానికి వచ్చేనాటికి ధర్మరాజుకు 16, భీమునికి 15,  అర్జునునకు – 14, నకుల సహదేవులకు-13 సంవత్సరాలని తెలుస్తుంది. భీముడు-ధుర్యోధనుడు ఒకే రోజున జన్మించారు కనుక యిరువురి వయస్సు ఒకటే. కృపాచార్యులు అనంతరం ద్రోణాచార్యులవద్ద విలువిద్య అభ్యసించిన కాలం 13 సంవత్సరాలట. అంటే విలువిద్య ముగిసేనాటికి ధర్మరాజు వయస్సు 29 సంవత్సరాలు. లక్కయింటిలోను, ఏకచక్రపురంలోను కలిసి  సంవత్సర కాలం ఉన్నారు అనుకుంటే ధర్మరాజు వయసు 30. ద్రౌపదిని వివాహం చేసుకుని పాండవులు దృపదుని యింట సంవత్సరం ఉన్నారట అంటే ధర్మరాజుకు 31 వయసు. అనంతరం హస్తినకు వచ్చి 5 సంవత్సరాలు ఉమ్మడిగా జీవించారట. అంటే ధర్మరాజు వయస్సు 36. పిమ్మట రాజ్యం పంచుకుని ఇంద్రప్రస్ధపురం విశ్వకర్మచే నిర్మించుకొని 23 సంవత్సరాలు రాజ్యపాలన చేసారని సభాపర్వం చెపుతుంది. అంటే 36+23=59. పన్నెండేళ్ళు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం 59+13=72 సంవత్సరాల వయసు ధర్మరాజుది. అతనికంటే కర్ణుడు దాదాపు 7 లేక 8 సంవత్సరాల పెద్దవాడు. మహభారత సంగ్రామం నాటికి ధర్మరాజు వయసు 72. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు 36 సంవత్సరాలు పరిపాలించాడు అంటే 72+36= 108 వయస్సులో స్వర్గారోహణ చేసాడు అతని పితామహుడు అయిన భీష్ముని వయసు ఎంత. దాదాపు 180 నుండి 200 వరకు ఉండాలి. భీష్ముని బాబాయి  బాహ్లీకుడు వయస్సు కూడా దాదాపుగా అంతేఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామంలో ధృతరాష్ట్రుని 1. పితామహుడు 2. పిత, 3. భ్రాతృడు, 4.పుత్రుడు, 5. పౌత్రుడు అనే 5 తరాలు అంతరించాయి.

వంశవృక్షం:

చంద్రవంశంలో 39వ తరం వాడు ప్రతీపుడు. యితను శిబి కుమార్తె అయిన సునందను వివాహం చేసుకున్నాడు. దేవాపి, శంతన, బాహ్లీకుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు. దేవాపి బాల్యంలోనే తపోధనుడుగా వనవాసం వెళ్ళాడు. శంతనుడు రాజయ్యాడు. అతనికి గంగాదేవికి భీష్ముడు జన్మించాడు. అనంతరం యొజనగంధి అయిన సత్యవతిని వివాహం చేసుకోగా, చిత్రాంగద విచిత్రవీర్యులు జన్మించారు. వీరిలో ఒకరు గంధర్వరాజు చేతిలో మరణించగా, మరోకరు క్షయవ్యాధికి లోనై మరణించారు. సంతానం కొరకు సత్యవతి తన కోడళ్ళు అయిన అంబిక, అంబాలికలకు దేవర న్యాయంగా కృష్ణ ద్వైపాయని వలన ధృతరాష్ట్ర పాండురాజులు జన్మించారు. అంబిక పరిచారిక యందు విదురుడు జన్మించాడు. గాంధారికి వేదవ్యాస వరప్రసాదంగా నూరుగురు సంతతి జన్మించారు. కుంతి మాద్రిలకు పలు దేవతల వరాన పాండవులు జన్మించారు. ద్రౌపదికి పాండవులకు ప్రతివింధ్యుడు-శ్రుతసోముడు-శ్రుతకీర్తి-శతానీకుడు-శ్రుతసేనుడు అనే పుత్రులు జన్మించారు. అంతేకాకుండా ధర్మరాజునకు-దేవిక అనే భార్యకు యౌధేయుడు జన్మించాడు. భీముడు-జలంధరలకు సర్వంగుడు, హిడింభి యందు ఘటోత్కచుడు జన్మించారు. అర్జున-సుభద్రలకు అభిమన్యుడు. ఉలూపికి ఇరావంతుడు, చిత్రాంగదకు బబ్రువాహనుడు, నకులుడు-రేణుమతిలకు నిరామిత్రుడు, సహదేవుడు-విజయలకు సుహోత్రుడు, అభిమన్యు ఉత్తరలకు పరీక్షిత్తుడు జన్మించారు. ఇతనికి మద్రావతికి జనమేజయడు జన్మించాడు. జనమేజయుని భార్య వుపుష్టి.

శంతనుడి సోదరుడు బాహ్లీకుడు అతనికి సోమదత్తుడు, అతనికి భూరిశ్రవుడు, శల శల్యులనే ముగ్గురు జన్మించారు. మెదటితరంలో భీష్మ, బాహ్లీకులు – రెండోతరంలో సోమదత్తుడు. మూడవతరంలో భూరిశ్రవుడు అతని సంతతి, నాల్గవతరంలో ధృతరాష్ట్ర-పాండురాజుల సంతతి. ఐదవతరంలో లక్ష్మణ కుమారుడు-అభిమన్యుడు-ఉపపాండవులు-ఇరావంతుడు-ఘటోత్కచుడు. పాండురాజు పౌత్రులలో చిత్రాంగద కుమారుడు బబ్రువాహనుడుతప్ప మిగిలిన 12 మంది యుద్దరంగంలో మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here