[box type=’note’ fontsize=’16’] షేర్ మార్కెట్ గురించి, స్టాక్ ఎక్స్చేంజిల గురించి, షేర్ మార్కెట్‌లో ఉపయోగించే పదజాలం గురించి సరళంగా వివరిస్తున్నారు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు. [/box]
[dropcap]మ[/dropcap]న భారతదేశంలో అభివృద్ధి చెందిన, పేరు మోసిన షేర్ మార్కెట్ ఇతర దేశాలకు ధీటైనదిగా నిర్వహించబడుతోంది. ఆసియా ఖండంలోనే చాలా పురాతనమైనది. భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్సేంజి 1875లో బొంబాయిలో (ముంబాయి) స్థాపించబడింది. షేర్ హోల్టర్ల జనసమర్ధం ఎక్కువగా ఉండే ప్రపంచ దేశాలలో భారతదేశం 2వ స్థానంలో ఉంది.
1.5 కోట్ల మంది షేర్ హోల్డర్స్ మనదేశంలో ఉన్నారు. పెద్దదయిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 5 కోట్ల మంది షేర్ హోల్టర్స్ కలరు. అది ఈ షేర్ మార్కెట్ విభాగంలో ప్రపంచ దేశాలైన జపాన్, యునైటెడ్ కింగ్‌డం, మరియి ఫ్రాన్స్ దేశాలకు ఆధిపత్యం వహిస్తోంది. భారతదేశ షేర్ హోల్టర్స్ గణనీయంగా ఎదిగినా, ప్రపంచంలోని షేర్ హోల్డర్స్ సంఖ్యలో భారత దేశ జనాభాలో 1.5 శాతం షేర్ హోల్డర్స్‌గా జమకాబడినారు. దేశంలో డిబేంచర్ హోల్డర్స్ గణనీయంగా… దాదాపుగా 5 మిలియన్ లెక్కకు వున్నా, వీరిలో చాలామంది లాభదాయక షేర్ హోల్డర్స్‌గా మారడానికి ఎదురుచూస్తున్నారు. పారిశ్రామిక ప్రపంచీకరణ నేపథ్యంలో కేపిటల్ మార్కెట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది.
భారతధేశ కేపిటల్ మార్కెట్ 2 విధములుగా విభజించబడింది. మొదటిది ప్రైమరీ మార్కెట్ (కొత్త కంపెనీ షేర్లు), రెండవది సెకండరీ మార్కెట్. ఆగష్ట్ 2007 ప్రాతంలో దాదాపు 6 స్టాక్ ఎక్స్చేంజులు దాదాపుగా క్రమబద్దీకరించబడి 51 శాతం బహిరంగ వాటాదారుగా మార్చబడినాయి. ప్రస్తుతం ప్రపంచంలో క్రమబద్ధీకరించిన జాతీయ స్టాక్ ఎక్స్చేంజిలు 18 కలవు.
వినిమయ వస్తువుల భవ్య విపణి వీధి:
బారత దేశ సెక్కూరిటీ మార్కెట్‌లో భవ్య విపణ వీధి ఓ ప్రదాన ధాతువు. జాతీయ ఎలక్ట్రానిక్ వ్యాపార వినిమయ వస్తు విపణి వీధిలో ధరవరల నియంత్రణ ఈ షేర్ మార్కెట్‌లో ప్రత్యేక విభాగము. మార్కెట్ షేర్‌గా భావిస్తారు.
Multi Commodity Exchange ముంబాయి – 74.7%
National Commodity and Derivatives Exchange – ముంబాయి 21.2 %
National Board of Trade – ఇండోర్ 3.4 %
National Multi Commodity Exchange – అహమ్మదాబాద్ 0.7 %
ఈ పై స్టాక్ ఎక్స్చేంజిలను Forward Markets Commission నియంత్రిస్తుంది.
సూచిక, ప్రపంచ ప్రఖ్యాత షేర్ మార్కెట్లు:
ముంబాయి – DOLEX, SENSEX, SXPCNX, NIFTY, FIFTY
న్యూయార్క – DOW JONES
టోక్యో – NIKKEI
ప్రాంక్‌ఫర్ట్ – MIDDAX
హంగ్‌కాంగ్ – HAN’G SENG
సింగపూర్ – SIMEX, STRAITS,TIMES,
SENSEX – Arithmetic average of the price relative to group of shares.
షేర్ మార్కెట్‌లో ఉపయోగించే నిర్దిష్ట పదజాలము:
ఆస్క్ ప్రైస్ : షేర్ అమ్మకానికి నిర్దిష్టపు కనీస ధర, అమ్మకందారుడిది.
బేర్: షేర్ విలువ పడిపోతుందని భావించి వచ్చినంతలో అమ్ముకునే వాళ్ళను బేర్ అంటారు.
బిడ్ : షేర్ కొందామని తాను షేరుకు ఇవ్వజూపిన రేటు.
బ్రోకరేజ్ : షేర్ మార్కెట్ మధ్యవర్తి తాను అమ్మినా, కొన్నా తీసుకునే దళారీ సామ్మునే బ్రోకరేజ్ అంటారు.
బుల్స్ : షేర్ విలువ పేరుగుతుందని భావించి ఎక్కువ లాభం ఇచ్చి కొనే వాళ్ళనే బుల్స్ అంటూరు
కాల్ ఆప్షన్ : కొనే వాళ్ళు షేరుని ఫలానా రోజకి ఫలానా రేటుకి కొంటామని తెలియబరచటం.
డిప్రిషియేషన్ : వినిమయంలో లేని స్టాక్ పాయింట్స్ కొనుగోలులో కొంత మేర తగ్గించి కొనడాన్ని డిప్రిషియేషన్ అంటారు.
డివిడెండ్ : భాగస్వామ్య కంపెనీలో వచ్చిన లాభాన్ని షేర్లను బట్టి పంచి పెట్టే లాభం పెట్టుబడుల నిష్పత్తి.
ఈక్విటీ : భాగస్వామ్య వ్యవస్థ షేర్లు.
గ్రోత్ స్టాక్ : ప్రస్తుత నిలకడ ధర పలికిన షేర్ భవిష్యత్‌లో అభివృద్ధి చెంది రేటు పెరగగలదని బావించే షేర్లుగా గుర్తించడం.
లిమిటెడ్ లయబిలిటీ : షేర్ హోల్డర్స్ షేరు పై చట్టరీత్యా బాధ్యత నిర్దిష్ట పరిమితిలో వుండేది. కంపెనీ బాధ్యత వహించవలసిన బాకీలపై వీటికి ఏ మాత్రం ముప్పు వాటిల్లదు.
మార్కెట్ ఆర్డర్ : షేర్ కొనాలన్నా అమ్మాలన్నా కనీస నిర్దిష్ట విలువను స్టాక్ మార్కెట్ ప్రకటిస్తుంది. అదే మార్కెట్ ఆర్డర్.
మ్యూచువల్ ఫండ్ : కొంతమంది పెట్టుబడిదారులు కొంత సొమ్మును కూడగట్టి ఓ కంపెనీకి వ్యాపార నిమిత్తం అధికారం బదలాయించి, ఆ చేసే వ్యాపారం లాభాలను పెట్టుబడుల నిష్పత్తిలో అందుకోవడం. ఇందుకు ప్రతిఫలంగా ఆ కంపెనీకి ఖర్చుల నిమిత్తం షేరు వారీగా కొంత పైకం అగ్రిమెంటు రూపంలో అనుకొనిన విధంగా చెల్లించడం.
నాస్‌డాక్ : National Association of Securities Dealers Automated Quotations – ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెట్‌వర్క్ పూరకంగా ఆ రోజు లిస్టెడ్ కంపెనీల కనీస మారకపు ధర నిర్ణయించి ప్రసారం చేసే సంస్థ.
ఓపెన్ ప్రైస్ : ట్రేడింగ్ మొదలైనప్పుడు ప్రప్రథమంగా నిర్ణయించిన షేర్ ధర.
పోర్ట్‌ఫోలియో : సొమ్ము మదుపుదార్ల కలిగియున్న వివిధ సంస్థల షేర్ల సమూహాన్ని పోర్ట్‌ఫోలియో అంటారు.
ప్రిఫరెన్స్ షేర్స్ : కంపెనీచే జారీచేయబడిన డిబెంచర్. మదుపుదార్ల తరువాత కంపెనీ ఆస్తిపాస్తుల షేర్ నష్ట సమయంలో పూర్తి వసూలు అధికారం ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్లు కలిగివుంటారు.
ప్రీమియం : కంపెనీ షేర్ల అమ్మకం విషయంలో పబ్లిక్ ఇస్యూగా వెళినపుడు దాని మూల షేరు ఖరీదు కన్నా అదనంగా దానికి విలువ పెంచి ప్రజలకు ఎలాట్ చేసే ఆ సొమ్ము గల షేర్ విలువనే ప్రీమియం అంటారు
సెక్యూరిటీ : భద్రతా పరమైన ఓ బాండ్ పత్రం. అన్ని విథములుగా ఆస్తి విలువ ప్రభుత్వపరంగా లేదా ప్రవేటు పరంగా విడుదల చేయబడిన షేరు పత్రం.
స్టాగ్ : ప్రైమరీ మార్కెట్‌లో అలాట్ కాబడిన షేర్ కొంత రేటు పెరిగినా ఉపేక్షించకుండా వెంటనే అమ్మే విధానాన్నే స్టాగ్ అంటారు.
మనదేశంలో అనుమతి పొందిన స్టాక్ ఎక్సేంజిలు:
- మీరట్ స్టాక్ ఎక్స్చేంజ్, మీరట్ (యుపి)
- యుపి స్టాక్ ఎక్స్చేంజ్, కాన్పూర్ (యుపి)
- ముంబయ్ స్టాక్ ఎక్స్చేంజ్. ముంబాయి.(మహారాష్ట్ర)
- ఓవర్ ది కౌంటర్ ఎక్స్చేంజ్ ఆప్ ఇండియా, ముంబాయి (మహారాష్ట్ర)
- నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ముంబాయి (మహారాష్ట్ర)
- పుణే స్టాక్ ఎక్స్చేంజ్, పూణే (మహారాష్ట్ర)
- అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, అహ్మదాబాద్ (గుజరాత్)
- వడోదరా స్టాక్ ఎక్స్చేంజ్. వడోదర(గుజరాత్)
- బెంగుళూర్ స్టాక్ ఎక్స్చేంజ్, బెంగుళూర్(కర్నాటక)
- కెనరా స్టాక్ ఎక్స్చేంజ్, మంగుళూరు (కర్నాటక)
- కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్, కలకత్తా (వెస్ట్ బెంగాల్)
- భువనేశ్వర్ స్టాక్ ఎక్స్చేంజ్, భువనేశ్వర్ (ఒరిస్సా)
- ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్, ఢిల్లీ
- గౌహతి స్టాక్ ఎక్స్చేంజ్, గౌహతి (అస్సాం)
- హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, హైదరాబాద్ (తెలంగాణా)
- జైపూర్ స్టాక్ ఎక్స్చేంజ్, జైపూర్ (రాజస్థాన్)
- లూధియానా స్టాక్ ఎక్స్చేంజ్, లూధియానా (పంజాబ్)
- చెన్నై స్టాక్ ఎక్స్చేంజ్, చెన్నై(తమిళనాడు)
- కోయంబత్తూర్ స్టాక్ ఎక్స్చేంజ్, కోయంబత్తూర్ (తమిళనాడు)
- యం.పి. స్టాక్ ఎక్స్చేంజ్, ఇండోర్ (మధ్యప్రదేశ్)
- మగధ స్టాక్ ఎక్స్చేంజ్, పాట్నా(బిహార్)
- కేపిటల్ స్టాక్ ఎక్స్చేంజ్ కేరళ లిమిటెడ్, తిరువనంతపురం (కేరళ)
- కొచ్చిన్ స్టాక్ ఎక్స్చేంజ్, కొచ్చిన్ (కేరళ)
లోటు బడ్జెట్ రకాలు:
- రెవెన్యూ లోటు :
రెవెన్యూ లోటు = రెవెన్యూ ఖర్చు – రెవెన్యూ ఆదాయం.
- బడ్జెట్ లోటు :
బడ్జెట్ లోటు = పూర్తి ఖర్చు – పూర్తి ఆదాయం.
- ఫిజికల్ ఆదాయపు లోటు :
ఫిజికల్ లోటు = సంపూర్ణ వ్యయం – సంపూర్ణ ఆదాయం + విపణి నుండి అప్పు.
- ప్రాథమిక లోటు:
ప్రాథమిక లోటు = ఫిజికల్ లోటు – వడ్డీల ఖర్చు.
ఈ స్టాక్ మార్కెట్ వ్యాసాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు బయటపడతాయి.
ధనవంతుల దగ్గర డబ్బు పెరిగితే అది మోచేతి నీళ్ళలా (ట్రాకిల్ డౌన్ ఎఫేక్ట్) కింది వర్గాలకు కూడా చేరుతుందన్నది ఈ విధానాల వెనుకున్న సారం.
వాస్తవానికి ధనవంతులు తమ వద్దకు చేరే అదనపు డబ్బును ఖర్చు పెట్టరు. ఎందుకంటే అప్పటికే వారు పూర్తి స్థాయిలో వ్యయం చేసి వుంటారు. పేదలు మధ్యతరగతి వాళ్ళు మాత్రమే తమ వద్దకు అదనపు మొత్తం చేరితే దానిని మార్కెట్‌లో ఖర్చు పెడతారు కాబట్టి ధనవంతులకు పారిశ్రామికవేత్తలకు లభించే అదనపు డబ్బు ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచలేదు. అలాగే డిమాండ్ లేకపోవడం వలన వారికి అదనంగా లభించే డబ్బును పారిశ్రామికవేత్తలు పెట్టుబడులుగా మార్చరు.
కాగా ఈ మధ్య కాలంలో జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ అనే ప్రత్యేక ఆర్థికవేత్త రాసిన “ది ఎకనామిక్స్ ఆఫ్ ఇన్నోసెంట్ ఫ్రాడ్” అనే పుస్తకంలో ఒక అధ్యాయం ధనవంతులకే అదనంగా రాయితీలు ఇచ్చే తరహా వాదనను తుత్తునియలు చేసింది. దీనికి మించి సుమారు మూడు దశాబ్దాల నయా ఉదారవాద విధానాల ఆచరణాత్మక ఫలితాలు కూడా దీనికి సజీవ తార్కాణం. అంటే కీన్స్ పరిష్కారాన్ని అమలు జరిపే స్థితిలో లేకా (సైద్ధాంతికంగానూ, ఆర్థికంగానూ కూడా) ప్రస్తుతం అనుసరిస్తోన్న ద్రవ్యవిధానాలు పని చేయక నేడు అమెరికా, స్థూలంగా దానిపై ఆధారపడి ఉన్న ప్రప్రంచ పెట్టుబడిదారీ వ్యవస్థా మరణవేదన పడుతున్నాయన్నది తిరుగలేని వాస్తవం. స్పెక్యులేషన్‌పై ఆధారపడిన స్టాక్ మార్కెట్‌ల వంటివి పెట్టుబడిదారీ సంక్షోభ సమయంలో కేవలం నీటిబుడగల వంటివే.
స్టాక్ మార్కెట్ మదుపుల లాభాలు కేవలం “వాన రాకడ – ప్రాణం పోకడ” తెలియని బ్రహ్మ పదార్థం లాంటిదే.