సంపాదకీయం డిసెంబరు 2018

0
3

‘సంచిక’ ఉగాది ప్రత్యేక సంచికతో సాహిత్య ప్రపంచంలో అడుగు పెట్టింది. అచిరకాలంలోనే పాఠకాదరణ సంపాదించింది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది.

రోజు రోజుకూ పెరుగుతున్న పాఠకాదరణ సంతృప్తినిస్తున్నా కాస్త భయాన్ని కూడా కలుగచేస్తోంది. ఎందుకంటే, పాఠకులు ఆశిస్తున్న స్థాయిలో ఆకర్షణీయమైన రచనలను అందచేస్తూ, సరికొత్త పాఠకులను ఆకర్షిస్తూ ముందుకు సాగాల్సివుంటుంది. అంటే ఇదొక డైనమిక్ సిస్టం అన్నమాట. రిలాక్సేషన్‌కి తావులేదు. ఇంతమంది పాఠకులు మనపత్రికను చదువుతున్నారు అని నిశ్చింతగా వుండే వీలు లేదు. పాఠకులను ఆకర్షిస్తున్న ఒక సీరియల్ అయిపోతూంటే దానికి దీటుగా ఆ పాఠకులనే కాదు, ఇంకా కొత్త పాఠకులను ఆకర్షించే సీరియల్‌ను ఆరంభించకపోతే, పాఠకులను పట్టివుంచటం కష్టం. ఒక విజయవంతమయిన ఫీచర్ అయిపోతూంటే మరో ఆకర్షణీయమైన ఫీచర్ ఆరంభించకపోతే ప్రమాదం. ఇలా అనుక్షణం పాఠకుల అభిరుచులను, ఆలోచనలను, ఆకాంక్షలను దృష్టిలో వుంచుకుని ముందుకు సాగాల్సివుంటుంది. ఈ నిజాన్ని గ్రహించిన ‘సంచిక’ అనుక్షణం తనని తాను విశ్లేషించుకుంటూ, విమర్శించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో పాఠకులు తమవంతు బాధ్యతగా తమ అభిప్రాయాలనూ, సూచనలనూ తెలపాలని కోరుతోంది.

అయితే, అడుగడుగునా ‘సంచిక’ ఒక ప్రతిబంధకాన్ని ఎదుర్కోవాల్సివస్తోంది. తెలుగులో ప్రస్తుతం విభిన్నమయిన రచనలు, నాణ్యంగా సృజించే రచయితలు తక్కువ. ఎవరికివారు తమచుట్టూ గిరిగీసుకొని, పరిధుల్లో వొదిగి వుండేందుకే ఇష్టపడుతున్నారు. ఎవరూ తమ కంఫర్ట్ జోన్‌ను దాటేందుకు సుముఖత చూపటంలేదు. దీనికితోడు యువ రచయితల సంఖ్య తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో విభిన్నమయిన రచనలను విశిష్టంగా సృజించే రచయితలను వెతుక్కోవటమో తయారుచేయటమో చేయాలి. ‘సంచిక’ ఆ దిశగా అడుగులు వేస్తోంది. యువ రచయితలకు ఆహ్వానం పలుకుతోంది. అంశం ఏమిటి? ఇది రాయవచ్చా? రాయకూడదా? ఇలా రాయొచ్చా? అన్న సంశయాలు లేకుండా తమ రచనలను ‘సంచిక’కు పంపమని కోరుతోంది.

ఇందులో భాగంగానే వేటూరి ఆనంద్ నవల ‘రాజకీయ వివాహం’ ఈ నెలనుంచీ ఆరంభమవుతోంది. యువకుల ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ అత్యంత ఆసక్తికరంగా సృజించిన రచన ఇది. పాఠకులను విశేషంగా ఆకర్షిస్తుందనటంలో సందేహం లేదు.

యువ రచయిత నవల ఆరంభమవుతున్న సంచికలోనే పాత తరం ప్రతినిధి చావా శివకోటి నవల ‘గతించని గతం’ ఆరంభమవటం విశేషం. కోరిన వెంటనే అత్యద్భుతమయిన రచనను పంపిన ఈ 80 ఏళ్ళ యువ రచయితకు సంచిక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతోంది. వీలయినంత వైవిధ్యభరితంగా సంచికను తీర్చిదిద్దాలన్న ‘సంచిక’ ప్రయత్నానికి ఈ రెండు పూర్తిగా విభిన్నము, విశిష్టము అయిన రచనలు నిదర్శనం.

సంచికలో సినిమా పాటలకు సంబంధించిన శీర్షిక కావాలని కోరుతున్న పాఠకులకు సంచిక అందిస్తున్న కానుక ఇంద్రగంటి జానకీబాల గారి సరికొత్త ఫీచర్. నెలకొకసారి వచ్చే ఈ ఫీచర్ సినిమా పాటలలో మహిళ అంతరంగం ప్రదర్శితమయిన తీరు, వారి వ్యక్తిత్వాలను ప్రదర్శించిన తీరును లోతుగా విశ్లేషించి వివరించే ఫీచర్. పాఠకులను ఈ ఫీచర్ అలరిస్తుందనటంలో సందేహం లేదు.

త్వరలో భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, కీ.శే. ఘండికోట బ్రహ్మాజీ రావు గారి చివరి నవల (అముద్రితం) ‘సంచిక’ పాఠకులను అలరించటం కోసం అందించబోయే రచనలు.

1 డిసెంబరు 2018 నాటి రచనలు

సంపాదకీయం

ప్రత్యేక వ్యాసం: ప్రబంధ సాహిత్యంలో ‘సలము’లు – ఇ.ఎన్.వి. రవి

సంభాషణం: డా. మచ్చ హరిదాసు అంతరంగ ఆవిష్కరణ

ధారావాహికలు:

జీవన రమణీయం-32 – బలభద్రపాత్రుని రమణి

రాజకీయ వివాహం-1- ఆనంద్ వేటూరి

నీలమత పురాణం-7 – కస్తూరి మురళీకృష్ణ

తమసోమా జ్యోతిర్గమయ -5- గంటి భానుమతి

అంతరం – 4- స్వాతీ శ్రీ పాద

గతించని గతం-1- చావా శివకోటి

కాలమ్స్:

ఆకాశవాణి పరిమళాలు-32 – డా. రేవూరు అనంతపద్మనాభ రావు

మనసులో మనసా – 15 – మన్నెం శారద

రంగుల హేల 9: మనం పురోగమిస్తున్నామా! – అల్లూరి గౌరీ లక్ష్మి

గిమ్మిక్కులు – కల్పిక – సలీం

మన సినిమాలలో మహిళ – పాట చిత్రీకరణ – ఇంద్రగంటి జానకీబాల

భక్తి పర్యటన:

గుంటూరు జిల్లా యాత్ర – 17:  పెదపులివర్రు – పి.యస్.యమ్. లక్ష్మి

భక్తి:

దివినుంచి భువికి దిగిన దేవతలు 5 – డా. ఎం. ప్రభావతి దేవి

కవితలు:

అశ్రుభోగ-2 – కోవెల సుప్రసన్నాచార్య

పెళ్ళి కెళ్ళి చూడు – చొక్కాపు లక్ష్మునాయుడు

నువ్వు – నేను: శంకరప్రసాద్

పిట్టగోడ కథలు-2 – Savvy

పుష్పాంజలి – తాళ్ళపూడి గౌరి

కథలు:

మతిమరపుకు మందు – పులిగడ్డ విశ్వనాథరావు

జారవ – శ్రేష్ఠ

ప్రెజెంటేషన్ – డా. మధు చిత్తర్వు

మనసున్న మొక్క – తోట సాంబశివరావు

వాసిష్ఠము- దేశభక్తి: – జొన్నలగడ్డ సౌదామిని

ప్రయాణం:

కాశ్మీర్ యాత్ర – 2 – డి. చాముండేశ్వరి

బాలసంచిక:

సిరిముచ్చట్లు -17- చల్లా సరోజినీ దేవి

కురుక్షేత్ర సంగ్రామంలో ఐదుతరాలు – డా. బెల్లంకొండ నాగేశ్వరరావు

బాలల గేయం – పుప్పాల జగన్మోహన్రావు

కోడి – డి. చాముండేశ్వరి

సినిమాలు:

ప్రాంతీయ దర్శనం-11- కొంకణి సినిమా – నాడు  – సికిందర్

పుస్తకాలు:

ఎమ్మెస్వీ కథలు – పుస్తక పరిచయం

మొదటి చీమ – సమీక్ష – కె.పి. అశోక్‌కుమార్

వ్యాసాలు:

షేర్ మార్కెట్ – యన్.వి.వి.యస్.యస్. ప్రకాశరావు

విశ్వనాథ విమర్శ – కోవెల సుప్రసన్నాచార్య

అవీ ఇవీ:

49వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం – వేదాంతం శ్రీపతిశర్మ

నీలి మేఘాలలో మెరసి, గాలి కెరటాలలో ఎగసి, నీ పాట మా మదిన వినిపించు ఏ పూట! – ఆర్. దమయంతి

కార్టూన్:

కె.వి.సుబ్రహమణ్యం – 7

‘సంచిక’లో ప్రచురితమయిన రచనలను త్వరలో ఆడియో రూపంలో అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే, చదవటానికి సమయం చిక్కనివారు ఇకపై సంచికను వినవచ్చు.

వీలయినంతమంది పాఠకులను చేరాలని, అలరించి ఆనందింపచేయాలని ‘సంచిక’ చేస్తున్న ప్రయత్నాలను ఆదరించి, సలహాలు, సూచనలతో దిశానిర్దేశనం చేయాలని పాఠకులను అభ్యర్థిస్తోంది ‘సంచిక’.

ఈ నెల ‘సంచిక’ మిమ్మల్ని అలరిస్తుందన్న ఆశతో…

సంపాదక వర్గం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here