[box type=’note’ fontsize=’16’] “నా నువ్వు నాకేమవుతావంటే ఏమని చెప్పేది?” అంటున్నారు విసురజ ఈ “వలపు సూత్రం/స్తోత్రం”లో. [/box]
[dropcap]నా[/dropcap] నువ్వు
నాకేమవుతావంటే ఏమని చెప్పేది
నీ నవ్వై
నిలిచిపోవాలంటే ఇంకేమి చేసేది
నీకై సతతం జపించి తపించేను
నీపై అక్షరాలతో వింజామర వీస్తాను
……
నా ఉషోదయం నీవు
నా సందెపొద్దు నీవు
నా హృదిమాటవి నీవు
నా మదిపాటవి నీవు
నా గుండెలయ నీవు
నా ప్రణయఝరి నీవు
నా నవ్వే నీవు
నా నువ్వే నీవు
నా మిన్ను నీవు
నా భువే నేవు
నా మనసే నీవు
నా మమతే నీవు
నా తలపే నీవు
నా కలిమే నీవు
నా రాగం నీవు
నా సరాగం నీవు
నా రతివి నీవు
నా అనురక్తివి నీవు
నా సన్మతి నీవు
నా సద్గతి నీవు
నా స్వరము నీవు
నా సర్వము నీవు
నా పరువు నీవు
నా పౌరషం నీవు
నా గమనం నీవు
నా గగనం నీవు
నా ఆనందం నీవు
నా విషాదం నీవు
నా ఆలోచన నీవు
నా కలవరం నీవు
నా స్నేహవల్లరి నీవు
నా ప్రేమమంజరి నీవు
నా వయసువేడి నీవు
నా వలపాహారతి నీవు
నాలో విరిసిన కొత్తూహలతో
ముర్సిబిగిసిన భవబంధమే నీవు
నాలో కలిగిన అనుభూతులతో
స్వరపర్చిన మధురసంగీతమే నీవు
నాకై ప్రత్యుష తరుణాన
కురిసిన హిమమే నీవు
నాకై విరిసే సుమబాల
ప్రఫుల్ల సుగంధమే నీవు
నీవు కనిపిస్తే
ఏమిటో తెలియని మురిపెం
నీవు పల్కరిస్తే
ఎదని చుట్టేసేనే అరుణం
అంతెందుకు ఇంతెందుకు
చెంతుంటే నీవు
గ్రీష్మం కార్తీకమవ్వు
వెంటుంటే నీవు
కల్పం క్షణమవ్వు
వలచిన చెలివేగా
దూరాన మరలా నిలుస్తావేల
మనసైన మదినేగా
ఆర్తితో తడిమి పాలించరావేల
కోరిన వలపురాజ్యాన్ని
అందుకున్న ప్రియురాలా
నచ్చుకున్న మనసురాజుకు
దాచుకున్న సొగసులందివ్వ
బిడియమేలోయ్ కాంచనమాలా!..