[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా తాబేళ్ళ గురించి, వాటి రకాల గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]హా[/dropcap]లిడే ఎంజాయ్ చెయ్యటానికి ఎక్కడకి వెళ్లాలని పిల్లలు పెద్దలు ఆలోచిస్తుంటే గ్రాండ్‌మా జూ పార్క్‌కి వెళ్దామన్నారు.
“అబ్బా! బోర్!” అన్నాడు అంకుల్.
“బోర్! అదేం మాట? పిల్లల ముందు అలాగేనా అనేది?” అన్నారు గ్రాండ్‌పా.
“క్లైమేట్ చేంజ్, వరదలు, వానలు, ఎండలు అని మాట్లాడటం కాదు. ముందుతరం నెక్స్ట్ జనరేషన్‌కి ఏమి చేస్తే క్లైమేట్ మారుతుందో చెప్పాలి. నేచర్/ప్రకృతికి ఫ్రెండ్స్‌గా చెయ్యాలి. అందుకు బెస్ట్ ప్లేస్ జూ పార్క్. పిల్లలు మనం రేపు మార్నింగ్ జూ పార్క్‌కి వెళ్లి మన ప్రకృతి నేస్తాలను కలిసి సంగతులు తెలుసుకుని వద్దాము” అన్నారు.
మర్నాడు పిల్లలు – గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్‌తో కలిసి జూ పార్క్‌కి వెళ్లారు. అందరు ఉత్సాహంగా తిరిగి చూస్తున్నారు. అమ్మమ్మ ఎప్పటిలా జూ లో ఉన్న వాటి సంగతులు చెబుతున్నారు.
ఇంతలో వాళ్ళకి ఒక చోట తాబేళ్లు గుంపుగా కనిపించాయి. పెద్దవి, చిన్నవి రకరకాల సైజుల్లో ఉన్నాయి. కొన్ని నీటి కొలను అంచులో కనిపించాయి.
“అమ్మమ్మా! turtle, tortoise” అని పిల్లలు కేకలు పెట్టారు. అలికిడికి కొన్ని తలతిప్పి చూశాయి. పిల్లలు వాటిని చూస్తూ కేరింతలు కొట్టారు.
“అమ్మమ్మా! కెన్ యు టెల్ అస్ అబౌట్ టార్టాయిస్?”
“తప్పకుండా. రండి లంచ్ తిన్నాక చెబుతాను.”
అందరు ఒక చెట్టు నీడ వెతుక్కుని దుప్పటి పరచుకుని కూర్చున్నారు. లంచ్ తరవాత కొద్దిసేపు రిలాక్స్ అవుతూ అమ్మమ్మ తాబేలు గురించి చెప్పటం మొదలుపెట్టారు.
“తాబేలు గురించి మీకు ఏమి తెలుసు?”
“నాట్ మచ్” అన్నారు పిల్లలు. “నువ్వు చెప్పిన పంచతంత్ర కథ, టీవీలో చూసిన కార్టూన్స్. అంతే.”
“సరే వినండి.”
“మీకు తెలుసా? మే 23వ తేదీ ప్రపంచ తాబేళ్లు దినోత్సవం. వరల్డ్ టర్టిల్ డే. 328 రకాల తాబేళ్లు ఉన్నాయిట. టార్టాయిస్, టర్టిల్ ఒకటి కావచ్చు. కానీ టర్టిల్, టార్టాయిస్ కాదు.
“అదేంటి?”
“టర్టిల్ chelonii తెగకు చెందిన గట్టి షెల్ కలిగిన reptile. టార్టాయిస్ అనేవి terrestrial turtle. దాదాపుగా 215 మిలియన్ ఇయర్స్‌గా భూమి మీద ఉన్నాయి. అవి సాధారణంగా నీటిలో ఈదలేవు, cant swim. రెండింటి మధ్య తేడా చెప్పాలంటే వాటి పాదాలు, షెల్ చూసి చెప్పవచ్చు. నీటిలో ఉండే టర్టిల్స్ పాదాలు ఫ్లిపర్స్‌లా ఉండి లాంగ్ క్లాస్ ఉంటాయి. షెల్ ఫ్లాట్‌గా చదునుగా ఉంటుంది. tortoise/తాబేలుకి ఏనుగు కాళ్ళు లాంటి బరువైన కాళ్ళు, డోమ్ లాంటి షెల్ ఉంటాయి.”
“అవునా?”
“తాబేళ్ల తిండి – గడ్డి, వీడ్, ఆకు కూరలు, పూలు, పండ్లు, కీటకాలు.”
“తాబేళ్లు గుంపుని ఏమంటారు?”
“తెలీదు.”
“creep అంటారు. చాల అరుదుగా అంటే rare గా కనిపిస్తాయి. సాధారణంగా తాబేళ్లు ఒంటరి జీవులు. తల్లి తాబేలు నెస్ట్ లోని పిల్లలు కొద్దిగా పెద్దవి అయ్యాక వాటిని పట్టించుకోదుట. మీకో వింత తెలుసా? తాబేళ్లు పురాతన ancient రోమన్ సైన్యాన్ని ఇన్‌స్పైర్ చేసాయట.”
“హౌ?”
“యుద్ధ సమయంలో సైనికులు testudo formation లో ఉంది సైన్యాన్ని కవర్ చేసేవారట. Testudo అంటే లాటిన్ భాషలో tortoise testudinal అంటే తాబేలు లేదా తాబేలు షెల్‌ని పోలి ఉండటం… resembling అన్నమాట.
తాబేలు షెల్ మూడు భాగాలూ – టాప్, బాటమ్, రెంటిని కలిపే వంతెన లాంటిది. కనపడవు. తాబేలుకు రిబ్స్, కాలర్ బోన్, వెన్నెముక షెల్‌లో ఉంటాయి. తాబేలు వెన్నుమీద షెల్ మీద కనపడే గీతలు తాబేలు ఎముకలను దెబ్బలు ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతాయిట. ఆ గీతాలు, డిజైన్స్‌ని scutes అంటారు. తాబేలు షెల్ రంగు ఎంత తక్కువగా ఉంటే అవి అంత ఎక్కువ వేడి ప్రాంతాల్లో ఉంటాయని చెబుతారు. తాబేళ్లు నీటిలో ఈదలేవు. కానీ నీటిలో ఉండాల్సి వస్తే ఊపిరిని చాలాసేపు ఆపి పెట్టగలవు. తాబేళ్లు షెల్స్‌కి నెర్వ్ చివర్లు ఉంటాయి. వాటికి స్పర్శ బాగా తెలుస్తుంది. వాటికి rub, pat, స్క్రాచ్ తెలుసు. Charles Darwin, Steve Irwin ఒకే తాబేలుని ఇష్టపడి కాపాడారు. దానిపేరు Harriet. డార్విన్ హారియట్‌ని 1835లో సేకరించి పేరుపెట్టి ఇంగ్లాండ్‌కి పంపాడు. అది చివరకి ఆస్టేలియా జూలో చేరిందిట. స్టీవ్ ఇర్విన్ తల్లితండ్రుల జూ అది. 2006లో చనిపోయిందిట.
తాబేళ్లు నిజమైన కంజర్వేషనిస్ట్. నీటిని, పోషకాలని వేరుచేసి బతకగలవు. నీటి ఎద్దడిలోగూడా. అవి వాటి గొంతుతో వాసనా పసిగట్టగలవు.
కుర్మావతారంలో విష్ణువు దేవతలు, అసురులు సముద్రంలో అమృతం కోసం ట్రై చేస్తున్నప్పుడు తాబేలుగా మారి మేరు పర్వతాన్ని కవ్వంగా చేసి చిలికారట. చైనీయులు తాబేలు షెల్స్‌తో జాతకం చెబుతారట. కొన్ని దేశాల్లో వాటిని ఆహారంగాను, కాస్మటిక్ పరిశ్రమల్లోను వాడతారట. తాబేళ్లు మనం అనుకున్నంత మందబుద్ధివి కాదు,తెలివైనవి. తాబేలు, ఎలుకకు పెట్టిన తిండి ప్రయోగంలో తాబేలు ఫుడ్‌ని చక్కగా వెతికి తిందట. రెండోసారి దారి మార్చిన సరిగ్గా ఫుడ్ దగ్గరికి చేరిందట.
కొన్ని తాబేళ్లు ఇసుకలో గుడ్లుపెట్టి పొడగటానికి వదిలివేస్తాయి. పిల్లలు బైటకి వచ్చి నీటిలోకి వెళ్లిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని గ్రూప్స్ వాటిని రక్షించటానికి పనిచేస్తున్నాయి. మారుతున్న వాతావరణం, మనుషుల స్వార్థం వల్ల అనేక జాతుల తాబేళ్లు నశించిపోతున్నాయి” వివరించారు అమ్మమ్మ.
“తాబేళ్లు కబుర్లు అయిపోతే మిగతా జూ పార్క్ చూద్దామా?” అని పిలిచారు గ్రాండ్‌పా.