ఏమి తెలుసు?

1
5

[box type=’note’ fontsize=’16’] “కళ్ళల్లోనే మెదులుతుంటావు, కలవరమే పెడుతూ ఉంటావు, నవ్వులతోనే కవ్విస్తుంటావు, వాలుచూపులతో ఊరిస్తుంటావు, ప్రియా నిన్ను చేరేదెలా” అని అడుగుతున్నారు డా. శ్రీకాంత్ భీంపల్లి ఈ గీతంలో. [/box]

ప౹౹ కన్నీటికేమి తెలుసు
ఎదలోని బాధ నలుసు
దుఃఖానికేమి తెలుసు
పగిలిన గుండె మనసు             ౹౹ప౹౹

చ౹౹ దూరానే ఉంటావు నువ్వు
గుండెనే గుచ్చుతుంటావు
జ్ఞాపకంగా మిగిలిపోయావు
గాయమై బాధ పెడుతుంటావు
ప్రియా నిన్ను మరిచేదెలా
మదిలోనే నిండిపో ఇలా
ప్రియా నిన్ను మరిచేదెలా
నా మదిలోనే నిండిపో ఇలా          ౹౹ప౹౹

చ౹౹ కళ్ళల్లోనే మెదులుతుంటావు
కలవరమే పెడుతూ ఉంటావు
నవ్వులతోనే కవ్విస్తుంటావు
వాలుచూపులతో ఊరిస్తుంటావు
ప్రియా నిన్ను చేరేదెలా
మనసులో నిలిచిపో ఇలా
ప్రియా నిన్ను చేరేదెలా
నా మనసులో నిలిచిపో ఇలా        ౹౹ప౹౹

చ౹౹  ఆశలే రోజూ రేపుతుంటావు
కన్నీళ్లలోనే మెరుస్తుంటావు
కలలోనే కలవరపెడుతుంటావు
కన్పించి మాయమవుతుంటావు
ప్రియా నిన్ను చేరేదెలా
చిరునవ్వుతో రా ఇలా
ప్రియా నిన్ను చేరేదెలా
ప్రేమతో రావే ఇలా                ౹౹ప౹౹

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here